Thursday, November 21, 2024
HomeAutomobileBike NewsTop 5 Electric Scooters in India: ఇండియాలోని టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

Top 5 Electric Scooters in India: ఇండియాలోని టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

Top 5 Electric Scooters in India: మన దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగం పెరుగుతుంది. ఈ-స్కూటర్లకు ప్రజాదరణ పేరుగుతుండటంతో కంపెనీలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. అయితే, మనం ఇప్పుడు ప్రస్తుత మన దేశ మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం..

ఏథర్ ఎనర్జీ 450 ఎక్స్ జెన్ 3 (Ather Energy 450x Gen 3 Scooter):

ఏథర్ ఎనర్జీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడో తరం మోడల్‌ ఏథర్ 450ఎక్స్ జెన్ 3ను 2022 జూలైలో విడుదల చేసింది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 8.7 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది.

(ఇది కూడా చదవండి: Honda Activa Electric Scooter: అదిరిపోయిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్)

ఆల్-అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌లో టైర్ల కోసం కొత్త ట్రెడ్ ప్రొఫైల్‌తో పాటు కొత్త టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ ఉంది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.39 లక్షలుగా ఉంది.

ఓలా ఎస్1 ప్రో జెన్2 (Ola S1 Pro Gen2 Scooter):

ఓలా ఎస్1 ప్రో జెన్2 అనేది కంపెనీ లాంచ్ చేసిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 195 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది కంపెనీ తెలిపింది. దీని గరిష్ట వేగం 120KMPHగా ఉంది. ఇది కేవలం 2.6 సెకన్లలో సున్నా నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఓలా ఎస్1 ప్రో జెన్2 ఎక్స్ షోరూమ్ ధరను రూ.1,47,499గా నిర్ణయించారు.

- Advertisement -

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ (Bajaj Chetak Electric):

బజాజ్ చేతక్‌ను ఎలక్ట్రిక్ మోడల్‌గా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక దీన్ని స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే దీని రేంజ్ 108 కిలోమీటర్లుగా ఉంది. దీని బ్యాటరీ గంటలో 25 శాతం ఛార్జ్ అయితే.. ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇది ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. బజాజ్ చేతక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,15,000 నుంచి ప్రారంభం అవుతుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ(Tvs iQube ST):

వీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ మోడల్ హైఎండ్ వేరియంట్. ఇందులో కూడా 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. దీని సీటు కింద రెండు హెల్మెట్స్ స్టోర్ చేయొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీనిని 950వాట్ ఛార్జర్‌తో మూడు గంటల్లో, 650వాట్ ఛార్జర్‌తో నాలుగున్నర గంటల్లో ఛార్జింగ్ చేయొచ్చు. దీని ధర రూ. 1,56,564గా ఉంది.

హీరో విడా వీ1 ప్రొ(Hero Vida V1 Pro):

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) సబ్ బ్రాండ్ విడా (Vida) గత సంవత్సరం విడాపేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే వీ1 ప్రో 163 కిమీ, వీ1 ప్లస్ 143 కిమీ దూరం ప్రయాణించవచ్చు. ఇందులో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. 65 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,25,900 నుంచి ప్రారంభమవుతుంది.

(ఇది కూడా చదవండి: TVS X Electric Scooter: అదిరిపోయిన టీవీఎస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్)

టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఇప్పుడే ఈ లింకు http://bit.ly/45sSz9h క్లిక్ చేయండి!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles