Friday, December 6, 2024
HomeAutomobileEV NewsHonda Activa Electric Scooter: అదిరిపోయిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ధర, రేంజ్ ఎంతో...

Honda Activa Electric Scooter: అదిరిపోయిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?

Honda Activa Electric Scooter Price and Range Details in Telugu: వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. హోండా కంపెనీ ఖచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించనప్పటికీ.. మార్కెట్ నిపుణులు 2024 మార్చిలో ఈ స్కూటర్ లాంచ్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఫిక్స్డ్​ బ్యాటరీ సెటప్​ ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ టాప్​ స్పీడ్​ 100 కేఎంపీహెచ్​ అని తెలుస్తుంది. స్పీడ్​, పర్ఫార్మెన్స్​ కన్నా.. హోండా కంపెనీ యాక్టివా ఈవీ రేంజ్​పై ఎక్కువగా ఫోకస్​ చేసినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్ రేంజ్: దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీల దూరం వెళ్ళే విదంగా డిజైన్ చేసినట్లు సమాచారం. దీనిని ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు లక్ష్యంగా చేసుకొని తీసుకొని వస్తున్నారు.

యాక్టివా ఈ-స్కూటర్ బ్యాటరీ: అత్యాధునిక లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉండనుంది.

యాక్టివా ఈ-స్కూటర్ ఫీచర్‌లు: దీనిలో LED లైటింగ్, సొగసైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్.. స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్‌లతో సహా అనేక ఆధునిక సౌకర్యాల ఉండనున్నాయి.

- Advertisement -

హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర: ఈ స్కూటర్ అధికారిక వివరాలు వెల్లడి కానప్పటికి.. సుమారుగా ₹1,00,000 మరియు ₹1,40,000 మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఓలా ఎస్​1, టీవీఎస్​ ఐక్యూబ్​, బజాజ్​ చేతక, ఏథర్​ 450ఎక్స్​ నుంచి హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ మరింత పోటీ ఎదుర్కోనుంది.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన టీవీఎస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles