Monday, September 16, 2024
HomeAutomobileమీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొంటే భారీగా ట్యాక్స్‌ బెన్‌ఫిట్స్‌

మీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొంటే భారీగా ట్యాక్స్‌ బెన్‌ఫిట్స్‌

ప్రస్తుతం దేశంలో ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సందడి చేస్తున్నాయి. రోజు రోజుకి పెట్రో ధరలు పేరుగుతుండటంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రావడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. ఇటీవల జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్‌సైట్‌ నిర్వహించిన సర్వే సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

ఈవీ వెహికల్స్‌తో ట్యాక్స్‌ బెన్‌పిట్స్‌

ఈ ఏడాది ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లు అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఎలక్ట్రిక్‌ కార్లు 132.4 శాతం, ఎలక్ట్రానిక్‌ బైక్స్‌ 115.3 శాతం, ఎలక్ట్రానిక్‌ సైకిళ్లు 66.8 శాతం డిమాండ్ పెరిగినట్లు జస్ట్‌ డయల్‌ తన నివేదికలో పేర్కొంది. అయితే భారత్‌లో ఈవీ వెహికల్స్‌ కొనుగోలు చేస్తే ఆర్ధికంగా మాత్రమే కాకుండా ట్యాక్స్‌ పరంగా కూడా అనేక ప్రయోజనాలు పొందవచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేసిన కార్లు లగ్జరీ ఉత్పత్తులుగా పరిగణిస్తారు.

(చదవండి: Evaru Meelo Koteeswarulu: షోలో రూ.కోటి ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా?)

కాబట్టి వినియోగదారులు కారు రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలను పొందలేరు. కానీ, ఈవీ వెహికల్స్‌ విషయానికి వస్తే అందుకు భిన్నంగా ఉంది. మనదేశంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఈవీ వెహికల్స్‌ వినియోగాన్ని ప్రోత్సాహిస్తున్నాయి. ఇందులో భాగంగా సెక్షన్ 80EEB ప్రకారం.. ఉద్యోగస్తులు రుణం తీసుకొని ఈవీ కారును కొనుగోలు చేస్తే.. తీసుకున్న లోన్‌ పై చెల్లించే వడ్డీలో రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఈవీ వెహికల్స్‌ రుణాలపై పన్ను మినహాయింపులు

  • సెక్షన్ 80EEB కింద ఎలక్ట్రికల్‌ వెహికల్‌ లోన్‌ చెల్లించే సమయంలో రూ.1,50,000 వరకు మొత్తం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పన్ను మినహాయింపు ఫోర్‌ వీలర్‌, టూ వీలర్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది.
  • సెక్షన్ 80EEB షరతులకు లోబడి ఉంటుంది. ఈ మినహాయింపును ఎవరైనా ఒక్కసారి మాత్రమే పొందవచ్చు. అంటే ఇప్పటికే ఒకసారి మాత్రమే రుణాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
  • ఈవీకి రుణ ఫైనాన్సింగ్ ఆర్థిక సంస్థలు లేదా ఎన్‌ఎఫ్‌బీసీల నుండి పొందవచ్చు.
  • ఈవీ పన్ను మినహాయింపు వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది, వ్యాపారా సంస్థలకు కాదు.
  • ఏప్రిల్ 1, 2019 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో తీసుకున్న అన్ని ఈవీ లోన్ చెల్లింపుల కోసం సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • సెక్షన్ 80EEB కింద పన్ను ప్రయోజనాలను 2020-2021 ఆర్ధిక సంవత్సరం నుంచి పొందవచ్చు.

(చదవండి: Evaru Meelo Koteeswarulu: షోలో రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles