ప్రస్తుతం మార్కెట్లో పెట్రోలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్ బంక్ వెళ్లిన ప్రతిసారీ సామాన్యుడు జోబు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈవీ స్కూటర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లో లభ్యం అవుతున్నప్పటికీ, మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ మధ్య మార్కెట్లోకి వచ్చాయి.

ఇటీవల మార్కెట్లోకి కొత్తగా వచ్చిన దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తూ వస్తూనే ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయని చెప్పుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది అత్యుత్తమం అనేది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న వాటిలో టాప్ – 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు తెలియజేస్తున్నాము.(చదవండి: ఓలా, ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా సింపుల్ వన్ స్కూటర్!)

ఓలా ఎస్1, ఎస్1 ప్రో(OLA S1, S1 Pro)

ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1ను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1,29,999గా ఉంది. ఓలా ఎస్1 సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అలాగే, అక్టోబర్ నుంచి 1,000 నగరాలు, పట్టణాల్లో డెలివరీల సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ స్కూటర్ బుక్ చేసుకోవాలంటే రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఐడీసీ మోడ్ లో 181 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది.

దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. దీనిని హైపర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 40 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్ ద్వారా ఇంట్లో చార్జ్ చేయడానికి సుమారు 6 గం. సమయం పడుతుంది. ఈ స్కూటర్లో రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ ఫంక్షన్, డ్రైవింగ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 0-40 కిలోమీటర్లు వేగాన్ని 3 సెకండ్లలో అందుకుటుంది. ఇది కీలెస్ లాక్, అన్ లాక్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, జియో ఫెన్సింగ్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్లో 3.97 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 రంగుల్లో లభిస్తుంది.

సింపుల్ వన్(Simple One)

సింప్లీ ఎనర్జీ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆగస్టు 15 నాడు ప్రారంభించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. మీరు సింపుల్ వన్ బుక్ చేసుకోవాలంటే రూ.1,947 చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్ వన్ ను రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్ ధర)కు లాంఛ్ చేశారు. సింపుల్ వన్ బ్రెంజ్ బ్లాక్, అజ్యూరే బ్లూ, గ్రేస్ వైట్, నమ్మ రెడ్ రంగులలో లభిస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి చార్జ్ చేస్తే ఐడీసీ మోడ్ లో 236 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. దీనిలో 4.8కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ(కంబైన్డ్ ఫిక్సిడ్, పోర్టబుల్), 7 కెడబ్ల్యు మోటార్ ఉన్నాయి. దీనిలో టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.

అథర్ 450ఎక్స్(Ather 450X)

అథర్ 450ఎక్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని రూ.1,44500 చెల్లించి బుక్ చేసుకుంటే మూడు నెలల తర్వాత డెలివరీ చేయనున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఇది 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్ లో 116 కి.మీ దూరం వెళ్ళినట్లు పేర్కొంది. దీని బ్యాటరీ ఐపీ 67 రేటెడ్ వాటర్ రెసిస్టెంట్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియంతో తయారు చేశారు. ఫ్రంట్ అండ్ రియర్ లు రెండు డిస్క్ బ్రేకులు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్ సిడి డిస్ ప్లేతో ఈ స్కూటర్ వస్తుంది. దీనిలో 2.61 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్(TVS iQube)

ఈ ఏడాది జూన్ నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అర్బన్ స్కూటర్ ను రూ.115,218 ధరకు విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ లో 2.25 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 4.4 కిలోవాట్లు గల ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 78 కి.మీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ ఫ్రంట్ టెలిస్కోపిక్, రియర్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ తో వస్తుంది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ 140 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ చేతక్(Bajaj Chetak)

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నుంచి వచ్చిన మొదటి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ మోటార్ చేత పనిచేస్తుంది. దీనిలో 3 కేడబ్ల్యు ఐపీ 67 రేటడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కి.మీ.. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా ఈ స్కూటర్ ని ఇంటి వద్దే ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం ధర ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here