రాబోయే రెండేళ్లలో దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రెండింతలు కానున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. భారత్‌నెట్ ప్రాజెక్ట్ గ్రామీణ ముఖచిత్రాన్ని మర్చివేయనుంది. రాబోయే రెండేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 150 కోట్లకు చేరనుంది.
ఇదే జరిగితే ప్రపంచంలోనే ఇంటర్నెట్‌తో అనుసంధానించిన అతిపెద్ద దేశంగా భారత్ నిలవనుంది. ఇంటర్ నెట్ కల్పనలో చైనా కూడా ఆ స్థాయిలో నిలవలేదు. ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.
ఇంటర్నెట్ కనెక్టివిటీని దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నడిపిస్తుంది. డేటా ప్రొటెక్షన్ బిల్లు డిసెంబర్‌లోగా రానుంది. డేటా గోప్యతను ప్రాథమిక హక్కుగా మనం పొందాము అని మంత్రి అన్నారు. ఇక తెలంగాణలో 2022 చివరి నాటికి ప్రతి ఇంటికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.2,000 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు’కు ఆటంకాలు తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఏపీలో కూడా ఇప్పటికే ఇంటింటికీ ఇంటర్ సౌకరిమా ఉన్నప్పటికీ. ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ లేని గ్రామాలకు త్వరలోనే అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.