Saturday, October 12, 2024
HomeTechnologyAppsయాపిల్‌ అదిరిపోయే ఫీచర్‌.. అచ్చం చిత్రలహరిలో సినిమాలో చెప్పినట్టే!

యాపిల్‌ అదిరిపోయే ఫీచర్‌.. అచ్చం చిత్రలహరిలో సినిమాలో చెప్పినట్టే!

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఐఫోన్, యాపిల్ వాచ్ లో తీసుకొనిరాబోయే కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ కొన్ని నెలలుగా పనిచేస‍్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ కార్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా?. అయితే, ఇప్పుడు మనం దాని గురుంచి తెలుసుకుందాం.

కార్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ గురించి సులభంగా చెప్పాలంటే.. రెండేళ్ల క్రితం టాలీవుడ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం “చిత్రలహరి సినిమా” కథ మొత్తం ఈ కారు డిటెక్షన్‌ ఫీచర్‌ మీదే నడుస్తుంది. ఈ సినిమాలో హీరో మనం ఎప్పుడైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాధ్యం జరిగితే ఆటోమేటిక్‌గా దగ్గరలోని ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్లకు సిగ్నల్ అందేలా ఒక యాప్ డిజైన్ చేస్తాడు. ఈ యాక్సిడెంట్‌ అలెర్ట్‌ సిస్టమ్‌ పేరుతో ఆ సినిమాలో ఓ స్టార్టప్‌ నెలకొల్పే కొత్త ఎంట్రప్యూనర్’గా హీరో మెప్పించాడు.

ఇప్పుడు అదే ఐడియాని యాపిల్‌ ఇంప్లిమెంట్‌ చేసే పనిలో పడింది. యాపిల్‌ కొత్త ‘కార్ డిటెక్షన్’ ఫీచర్‌ ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌లోనూ పని చేయనుంది. ఇందుకోసం యాపిల్‌ యాక్సిలరేటర్ వంటి సెన్సార్‌ల నుంచి డేటాను ఉపయోగించాలని ప్లాన్‌ చేస్తుంది. దీంతో కారు ప్రమాదానికి గురైనప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తి గుర్తించి 911(పోలీస్‌, ఫైర్‌, మెడికల్‌) విభాగానికి ఇన్ఫర్మేషన్‌ చేరవేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొనిరావాలని చూస్తుంది. గూగుల్ కూడా ఇప్పటికే ఈ ఫీచర్ ని పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌లలో తీసుకొని వచ్చింది. గూగుల్‌ ఫోన్‌ లొకేషన్, మోషన్ సెన్సార్‌లు కారు ప్రమాదాన్ని గుర్తించి, ఆపై అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles