Amazon Great Indian Festival Sale 2022: మీరు కొత్తగా మొబైల్ లేదా ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) మళ్లీ సరికొత్త సేల్‌తో మీ ముందుకు వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022(Great Indian Festival Sale) పేరుతో ఈ సేల్ నిర్వహించనుంది. ఈ నెలలోనే సేల్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, హెడ్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు చాలా ప్రొడక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లు తీసుకొని రానుంది. అలాగే, అదనంగా బ్యాంక్ కార్డ్ ఆఫర్ ద్వారా అదనపు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే అతిత్వరలో బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌ను ప్రకటించగా.. ఇప్పుడు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
(ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days Sale 2022: కొత్త మొబైల్ కొనేవారికి గుడ్ న్యూస్.. వాటిపై 80% డిస్కౌంట్!)
ఈ సేల్‌కు సంబంధించిన తేదీలను ఇంకా వెల్లడించలేదు. అయితే మరో రెండు వారాల్లోనే ఈ సేల్ వచ్చే అవకాశం ఉందో. మరో మూడు నాలుగు రోజుల్లో సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించొచ్చు. ఇప్పటికే సేల్ సంబంధించి వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన పేజీని క్రియేట్ చేసి కొన్ని డీల్స్, డిస్కౌంట్లను అమెజాన్ టీజ్ చేస్తోంది.
Amazon Great Indian Festival Sale 2022: బ్యాంక్ కార్డ్ ఆఫర్లు
ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్‌బీఐ(SBI) డెబిట్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. రూ.1,500 వరకు ఎక్స్‌ట్రా తగ్గింపు పొందవచ్చు. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వారికి ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.
(ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days Sale 2022: కొత్త మొబైల్ కొనేవారికి గుడ్ న్యూస్.. వాటిపై 80% డిస్కౌంట్!)
స్మార్ట్‌ఫోన్‌లపై 40శాతం డిస్కౌంట్
ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40శాతం వరకు ఆఫర్లు(Mobile Offers) ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. సామ్‌సంగ్ ఎం సిరీస్, ఐకూ మొబైల్స్‌పై అమెజాన్ భారీ ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్, రెడ్‌మీ, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివోతో పాటు మిగిలిన కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఆఫర్లతో అందుబాటులోకి వస్తాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్, ట్యాబ్‌లు, టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్ లాంటి ప్రొడక్టులపై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయని అమెజాన్ తెలుపుతోంది.

స్మార్ట్‌టీవీలపై 60 శాతం డిస్కౌంట్
Amazon Great Indian Festival సేల్‌లో స్మార్ట్‌టీవీలపై 60 శాతం వరకు ఆఫర్లు లభించే అవకాశం ఉంది. వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు, రిఫ్రిజిరేటర్లపై 50 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అమెజాన్ పేర్కొంది. ఎల్‌జీ, వన్‌ప్లస్, షావోమీ, సోనీతో పాటు చాలా బ్రాండ్స్ హోమ్ అప్లయన్సెస్ డిస్కౌంట్ ధరలకు లభించే అవకాశం ఉంది. అమెజాన్‌కు చెందిన అలెక్స్, ఫైర్ టీవీ, కిండిల్ ప్రొడక్టులపై కూడా భారీ ఆఫర్లు ఉండొచ్చు.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించడంతో ఈ పండుగ సీజన్‌లో ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు పోటీపడి ప్రొడక్టుల మీద భారీగా డిస్కౌంట్స్ ఇచ్చే అవకాశం ఉంది.