Sunday, October 13, 2024
HomeBusinessFlipkart Big Billion Days Sale 2022: కొత్త మొబైల్ కొనేవారికి గుడ్ న్యూస్.. వాటిపై...

Flipkart Big Billion Days Sale 2022: కొత్త మొబైల్ కొనేవారికి గుడ్ న్యూస్.. వాటిపై 80% డిస్కౌంట్!

Flipkart Big Billion Days Sale 2022: మీరు కొత్త మొబైల్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ దసరా పండుగ సందర్భంగా ‘ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022(Big Billion Days Sale 2022)” అతి త్వరలో నిర్వహించడానికి సిద్దంగా ఉంది. ఈ మెగా షాపింగ్ ఫెస్టివల్’కి సంబంధించిన తేదీని కంపెనీ ప్రకటించనప్పటికీ, ఈ నెలాఖరులోగా ఈ సేల్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది.

టిప్ స్టార్ అభిషేక్ యాదవ్ ప్రకారం, “ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022(Flipkart Big Billion Days Sale 2022)” సెప్టెంబర్ 23న నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్’తో పాటు అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ షాపింగ్ ఫెస్టివల్, రిలయన్స్ ఫెస్టివల్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్:

Flipkart నిర్వహించే “బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022(Big Billion Days Sale 2022)”లో ఐఫోన్’తో పాటు రియల్ మీ, పోకో, వివో, శామ్సంగ్ వంటి కంపెనీలకు చెందిన బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, టీవీలు మరియు ఇతర ఉపకరణాలపై కొనుగోలుదారులు 80% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

(ఇది కూడా చదవండి: Google Maps: మీ కుటుంబ సభ్యుల లోకేషన్‌ని గూగుల్‌ మ్యాప్స్‌లో ట్రాక్ చేయండి ఇలా..?)

సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ విడుదల కావస్తున్నసందర్భంగా ఈసారి కొనుగోలుదారులు ఐఫోన్ 13 అలాగే ఐఫోన్ 12పై మంచి డిస్కౌంట్లను ఆశించవచ్చు.

- Advertisement -

దుస్తులపై 60-90 శాతం డిస్కౌంట్:

వివిధ ఫ్యాషన్ బ్రాండ్స్‌పై ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌(Big Billion Days Sale 2022)లో 60-90 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. టీషర్ట్స్, జీన్స్, జాకెట్స్, టాప్స్, ఇతరత్రా దుస్తులపై ఈ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే అలెన్ సోలీ, ఫాస్ట్ ట్రాక్ వంటి టాప్ బ్రాండ్స్‌కి చెందిన వాచీలపై 80 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.

బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్ వస్తువులపై:

మహిళలు ఉపయోగించే మేకప్ కిట్స్, కాస్మోటిక్స్, పర్ఫ్యూమ్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, పిల్లల టాయ్స్, స్టేషనరీ, ఫుడ్ అండ్ బేవరేజెస్‌ వాటిపై 60 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.

హోమ్ అండ్ కిచెన్:

ప్రెజర్ కుక్కర్స్, హోమ్ ఫర్నీషింగ్స్, హోమ్ టూల్స్, హోమ్ డెకార్ తదితర వస్తువులపై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. అలాగే, ఫర్నీచర్, పరుపులపై 85 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

(ఇది కూడా చదవండి: Google Maps: మీ కుటుంబ సభ్యుల లోకేషన్‌ని గూగుల్‌ మ్యాప్స్‌లో ట్రాక్ చేయండి ఇలా..?)

బిగ్ బిలియన్ డేస్ డీల్స్:

డిస్కౌంట్ ఆఫర్స్ మాత్రమే కాదు పలు డీల్స్ కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. క్రేజీ డీల్స్, రష్ అవర్ డీల్స్, టిక్‌టాక్ డీల్స్ పేరిట కొన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరకే అందించనున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ టైఅప్ అయింది. దీంతో ఈ బ్యాంకు కార్డులపై బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles