ఒకప్పుడు దేశంలో అమ్మకాలలో నెంబర్ వన్ స్కూటర్ గా నిలిచిన బజాజ్ చేతక్ ఈ సారి సరికొత్త రూపంలో ధర్శనం ఇచ్చింది. బజాజ్ ఆటో కంపెనీ చేతక్ లో అనేక మార్పులు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో 2020 ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్, స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చిన ఈ స్కూటర్‌ను కంపెనీ రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్కూటర్ కోసం ముందుగానే బుక్ చేసుకోవాలని పేర్కొంది. సంస్థ తెలిపిన ప్రకారం ఈ షోరూమ్ కూడా అందుబాటులో ఉంది.(ఇది చదవండి: హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం)
కంపెనీ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బెంగళూరు, పూణేలలో విడుదల చేసింది. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ అందుకున్న తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది. బజాజ్ చేతక్ యొక్క బేస్ వేరియంట్‌కు అర్బన్ అని పేరు పెట్టారు, దీని ధర రూ.1.15 లక్షలు. అలాగే, కంపెనీ తన టాప్ వేరియంట్‌కు ప్రీమియం అని పేరు పెట్టింది, దీని ధర రూ.1.20 లక్షలు. ఈ స్కూటర్ మొత్తం 6 రంగులలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కంపెనీ ఐపి 67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించింది.(ఇది చదవండి: ఓలా సంచలనం: సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణం)
ఈ స్కూటర్‌లో ఎకో, స్పోర్ట్ అనే రెండు వేర్వేరు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్ పూర్తి ఛార్జీతో ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, స్పోర్ట్ మోడ్‌లో 85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్‌తో కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వారంటీ ఇస్తోంది. ఈ స్కూటర్ ను సంవత్సరానికి ఒకసారి లేదా 12,000 కి.మీ వద్ద సర్వీసింగ్ చేసుకోవాలి. దీనిని పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది, 1 గంటలో ఈ స్కూటర్ 25 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది సాధారణ 15 ఆంపియర్ గృహ సాకెట్‌తో ఛార్జ్ చేయవచ్చు. దీని బ్యాటరీ జీవితం 70 వేల కిలో మీటర్లు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎల్లప్పుడూ బ్యాటరీ శాతాన్ని 15 కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.