Ola Electric Scooter: “ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ” కంపెనీ తమిళనాడులోని కృష్ణగిరిలో 500 ఎకరాల స్థలంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలెక్ట్రిక్ వాహనాల మెగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కొత్త ఫ్యాక్టరీ భారతదేశంలోని ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను తీర్చడమే గాక “ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ” ప్రపంచ ఎగుమతి కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఈ కొత్త ప్లాంట్‌లో తయారు చేసే ఎలెక్ట్రిక్ వాహనాలను యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. ఒక కోటి వాహనాలను ఏడాది కాలంలో తయారు చేయగల సామ‌ర్థ్యంతో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. దీని పూర్తిస్థాయి కార్య‌క‌లాపాలు 2022 సంవత్సరంలో ప్రారంభం కానుంది.(చదవండి: ట్రెండింగ్: పది నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్‌ చార్జ్!)

ఓలా కంపెనీ గత ఏడాది నేద‌ర్లాండ్ ఆమ్‌స్టర్ ‌డామ్‌ కేంద్రంగా పనిచేసే ఈవీ బ్రాండ్ ఏటిర్గో స్కూటర్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ “ఎలెక్ట్రిక్ ఏటిర్గో స్కూటర్” వివరాలను బయటకి వెల్లడించింది. ఓలా ఎలెక్ట్రిక్ స్కూటర్ ప్రవేశంతో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలైన ఈథర్, బజాజ్ చేతక్, టివిఎస్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఏటిర్గో ఎలెక్ట్రిక్ ‌స్కూటర్ మొట్టమొదట 2018లో త‌యారైంది. దీన్ని ఒక్కసారి సింగిల్ చార్జ్ చేస్తే 240 కిలోమీట‌ర్లు దూరం వరకు ప్రయాణించవచ్చు. అలాగే, ఈ ఎలక్ట్రిక్ ‌స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0-45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను స్మార్ట్‌ఫోన్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎల్‌ఇడి లైటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ.1.30ల‌క్ష‌ల నుంచి రూ.2 లక్షల ధ‌ర‌ల్లో అందుబాటులో ఉంటే ఓలా మాత్రం ఎలక్ట్రిక్ ఏటిర్గో స్కూటర్‌ను రూ.1.25లక్షలకు తీసుకురావాలని భావిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది అక్టోబర్ లో వ‌చ్చే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక ఆ ధరకు అందుబాటులోకి తీసుకొస్తే ఒక సంచలనం సృష్టించనుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.