Saturday, April 20, 2024
HomeBusinessHouse Buying Rule: కొత్త ఇల్లు కొనేముందు.. ఈ 5/20/30/40 ఫార్ములా గురుంచి తెలుసుకోండి?

House Buying Rule: కొత్త ఇల్లు కొనేముందు.. ఈ 5/20/30/40 ఫార్ములా గురుంచి తెలుసుకోండి?

House Buying Rule: సగటు భారతీయ కుటుంబంలో సొంతిల్లు అనేది అత్యంత ప్రతీష్టాత్మక కలలో ఒకటి!. సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచి దీనికోసం ఎంత కొంత పొదుపు చేస్తారు. అయితే, సరిగ్గా ఇల్లు కొనేసమాయనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇల్లు కట్టడం కోసం ఎంతో హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే 15 నుంచి 20 ఏళ్ల పాటు ఇది మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది.

(ఇది కూడా చదవండి: Home Loan Tax Benefits: గృహ రుణంపై ఆదాయపు పన్ను రాయితీ పొందడం ఎలా..?)

అందుకోసమే ఇల్లు కొనేముందు ఈ 5/20/30/40 ఫార్ములా గురుంచి తెలుసుకుంటే చాలా మంచిది. దీని వల్ల రాబోయే కాలంలో వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకోగలరు. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ 5/20/30/40 ఫార్ములా గురుంచి తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అని నిపుణులు పేర్కొంటున్నారు.

5 అంటే ఏమిటి?

ఈ 5/20/30/40 ఫార్ములలో “5 రూల్” అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నియమంలో “5” అంటే మీరు ఇంటి కోసం చేసే మొత్తం ఖర్చు మీ ఆదాయానికి 5 రేట్లు మించకూడదు అని అర్ధం. మీ వార్షిక ఆదాయంలో ఇంటి కోసం చెల్లించే డబ్బులు అనేవి 5రేట్లకు మించరాదు. ఉదాహరణ: ఒక వ్యక్తి వార్షిక సంపాదన అనేది రూ.10 లక్షలు అయితే, ఆ వ్యక్తి ఇంటి కోసం చేసే ఖర్చు రూ.50 లక్షలకు మించరాదు.

20 అంటే ఏమిటి?

ఈ 5/20/30/40 ఫార్ములలో “20” అంటే రుణ కాల వ్యవదిని సూచిస్తుంది. మీ ఇంటి కోసం తీసుకునే రుణ కాల వ్యవదిని వయస్సు బట్టి “20” ఏళ్ల వరకు పెంచుకోవచ్చు. మీ రుణ కాల వ్యవదిని 20 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మంచిది. మీ ఈఎమ్ఐ కోసం చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటే కాలవ్యవదిని పెంచుకున్న పర్వలేదు.

- Advertisement -

30 అంటే ఏమిటి?

ఈ 5/20/30/40 ఫార్ములలో “30” అంటే మీరు అన్నీ రకాలుగా చెల్లించే ఈఎమ్ఐ((కారు, వ్యక్తిగత రుణం, గృహ రుణం వంటి అన్ని ఇతర ఈఎమ్ఐలతో సహా) మొత్తం మీ ఆదాయం 30 శాతానికి మించరాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలు అనుకుంటే, ఆ మొత్తంలో అన్నీ ఈఎమ్ఐ మొత్తాలకు కలిపి రూ.2 లక్షలకు మించరాదు. దీని వల్ల మీరు ఆర్ధిక ఇబ్బందుల నుంచి తప్పించుకోగలరు.

40 అంటే ఏమిటి?

మీరు కొత్త ఇల్లు కొనడానికి గృహ రుణం తీసుకోవాలని భావిస్తే.. ఆ ఇంటి మొత్తం విలువలో 40 శాతం డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తే మంచిది. మిగతా మొత్తం కోసం రుణం తీసుకోవచ్చు. మీరు తీసుకునే గృహ రుణం మాత్రం మీ కొత్త ఇంటి విలువలో 60 శాతం కంటే తక్కువగా ఉంటే చాలా మంచిది. ఎవరైతే, కొత్త ఇల్లు కొనేముందు.. ఈ 5/20/30/40 ఫార్ములా అనేది పాటిస్తారో వారికి ఆర్ధిక సమస్యలు అనేవి దరిచేరవు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles