PAN-Aadhaar-Link

PAN Aadhaar Link: మీ దగ్గర పాన్ కార్డ్(PAN Card) ఉందా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. కేంద్రం కొత్తగా పాన్ కార్డుకు సంబంధించి నూతన నియమ నిబంధనలన్నీ తీసుకొని వచ్చింది. అయితే, ఈ నూతన నిబందనలకు గురించి మీకు తెలుసా? ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని సెక్షన్స్‌ ప్రకారం పాన్ కార్డుకు సంబంధించిన నియమనిబంధనలను ఉల్లంఘిస్తే పాన్ కార్డ్ హోల్డర్లు భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నూతన నిబందనల ప్రకారం.. పాన్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా తమ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరుతోంది.

ఇప్పటికే కేంద్రం పాన్-ఆధార్ లింక్ గడువును అనేకసార్లు పొడిగించింది. చివరిసారిగా 2021 సెప్టెంబర్ 30 నుంచి 2022 మార్చి 31 వరకు డెడ్‌లైన్ పొడిగించిన సంగతి తెలిసిందే. అంటే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈ నెల చివరి రోజు వరకు మాత్రమే గడువు ఉంది.కరోనా కారణంగా ఆధార్, పాన్ లింక్ గ‌డువు తేదీని ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) పొడిగించింది. అయితే.. ఈసారి మాత్రం ఇక గ‌డువును పొడిగించేది లేద‌ని సీబీడీటీ స్పష్టం చేసింది. మార్చి 31 లోపు ఆధార్, పాన్‌ను లింక్ చేసుకోకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామ‌ని సీబీడీటీ హెచ్చరించింది.

పాన్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకు క్లిక్ చేయండి

https://youtu.be/48qaz47lEHs