Friday, October 18, 2024
HomeBusinessమ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!

మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి!

Mutual Fund Investment Tips in Telugu: కొద్ది పాటి సంపాదనతో లక్షాధికారులు ఎలా అవ్వాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించే ఉంటారులే. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాల్లో పొదుపు చేయడం గొప్ప వరం .. అందుకే పొదుపు చేసిన సొమ్మును ఎక్కడో ఒక చోట పెట్టుబడిగా పెట్టి అదనంగా డబ్బు సంపాదించే మార్గాలని అన్వేషిస్తుండడం సర్వసాధారణం. అయితే అలా కొద్ది కొద్దిగా పెట్టుబడి బడి పెడుతూ డబ్బులు ఎక్కువ సంపాదించే పెట్టుబడి సాధనాలు అనేకం ఉన్నాయి.

అలాంటి పెట్టుబడి సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. మీరు మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే పెట్టుబడి పెట్టేముందు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే ఆర్ధిక పరమైన ఇబ్బందులో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో

పెట్టుబడి లక్ష్యాలు

మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఎందుకోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు. ఎంత పెట్టాలని అనుకుంటున్నారు . స్వల్పకాలమా?, మధ్యకాలమా? దీర్ఘకాలమా? ఇలా నిర్ణయించుకుంటే భవిష్యత్ లో ఎదురయ్యే రిస్క్ ను సైతం అంచనా వేయొచ్చు.

మ్యూచువల్ ఫండ్‌లో రకాలు

మ్యూచువల్ ఫండ్‌లు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ వంటి వివిధ రకాలు పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పెట్టుబడితో ప్రతి మ్యూచువల్ ఫండ్స్ నుంచి వేర్వేరు లాభాలు, ప్రయోజనాలు పొందవచ్చు. అది రిస్క్’ను బట్టి ఉంటుంది. మీ రిస్క్ టాలరెన్స్, పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టబడి పెడితే మంచితో ముందుగా నిర్ధారించుకోండి.

- Advertisement -

మ్యూచువల్ ఫండ్ పనితీరు

మ్యూచువల్ ఫండ్ హిస్టరీని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలను పరిగణలోకి తీసుకుని లాభనష్టాలను బేరీజు వేయాలి. గతంలో ఓ మ్యూచువల్ ఫండ్ అద్భుతంగా పనిచేస్తే భవిష్యత్ లో అలాంటి ఫలితాలు వస్తాయని ఆశించ కూడదు. మార్కెట్ పనితీరుకు అనుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటాయి.

లోటుపాట్లను గుర్తించాలి

మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడుతున్నామంటే లోటుపాట్లను అంచనా వేయడం చాలా అవసరం. ఫండ్ వర్గాన్ని బట్టి క్రెడిట్ రిస్క్, వడ్డీ రేటు రిస్క్, మార్కెట్ రిస్క్ వంటి అంశాలను పరిగణించండి.

ఎగ్జిట్ లోడ్ మరియు లిక్విడిటీ

నిర్దిష్ట వ్యవధి కంటే ముందే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చో లేదో తెలుసుకోండి. దీంతో పాటు రీడీమ్ చేసే అవకాశం ఉందా? లేదా అని తెలుసుకోవడం మంచిది.

ట్యాక్స్ మినహాయింపు

మీరు మ్యూచువల్ ఫండ్స్’లో పెట్టుబడి పెట్టే ముందు ట్యాక్స్ బెన్ఫిట్స్ ఉన్నాయా, లేవా అని ముందుగా తెలుసుకోవాలి. తద్వారా భవిష్యత్ లో ట్యాక్స్ నుంచి రాయితీ పొందవచ్చు.

పూర్తి సమాచారం తెలుసుకోండి

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టబడి పెట్టే ముందు మీకు అందిన పెట్టబడి తాలూకు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం. ఫీజులు, నష్టాల గురించి అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.

- Advertisement -

రెగ్యులర్ మానిటరింగ్

మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత పెట్టుబడిదారుడిగా మీ బాధ్యతలు ముగియవు. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు మీ లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్‌కు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. అవసరమైన విధంగా మీ పోర్ట్‌ఫోలియోను తిరిగి అంచనా వేయండి , రీబ్యాలెన్స్ చేయండి.

ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ లో ఆందోళనకు గురి కాకుండా సురక్షితంగా ఉండొచ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles