Monday, November 4, 2024
HomeGovernmentTelanganaతెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల తేదీలు ఖరారు!

తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల తేదీలు ఖరారు!

Download Telangana Job Calendar, Check Full Details: పోటీపరీక్ష కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్ధులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబర్ లో గ్రూప్ 1 నోటిఫికేషన్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనుంది. దీంతో పాటు అక్టోబర్ లో గ్రూఫ్ 2, గ్రూప్ 3 నవంబర్ లో నిర్వహించనుంది. అదే నెలలో ఏడబ్ల్యూఈ, ట్రాన్స్ కో,డిస్కం ఇంజినీరింగ్ ల పోస్ట్ ల భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్,నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్’లో నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే.. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇక.. ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆగస్టు నెలలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అలాగే.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిభ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ ఎగ్జామ్స్ మేలో నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించారు.

Job నోటిఫికేషన్స్, పరీక్షల షెడ్యూల్ ఇదే:

  • వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం 2024 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల… నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు .
  • ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం 2024 అక్టోబర్‌లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహిస్తారు.
  • నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి 2025లో జనవరిలో పరీక్షలు నిర్వహిస్తారు.
  • వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం 2025 జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. 2025 ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ .. 2025 మేలో పరీక్షలు నిర్వహిస్తారు.
  • గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది 2025 జులైలో నిర్వహించనున్నారు.
  • ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు.
  • డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు 2025 జూన్‌లో నోటిఫికేషన్..సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
  • 2025 మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
  • 2025 జులైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్ నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
  • సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం 2025 జులైలో నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
  • పోలీసు శాఖలో ఎస్సై సివిల్ పోస్టులకు 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles