Sunday, October 13, 2024
HomeBusinessకొత్త ఇల్లు కొనేవారికి శుభవార్త.. ఇదే సరైన సమయం..!

కొత్త ఇల్లు కొనేవారికి శుభవార్త.. ఇదే సరైన సమయం..!

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌-2022 సామాన్యులకు నిరాశే మిగిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సామాన్యులు ఎంతో నిరుత్సాహ పడ్డారు. అయితే, సామాన్యులకు ఊరట కలిగించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

రెపో రేట్లు యథాతథం

తాజాగా ఆర్‌బీఐ నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశంలో రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని నివాస గృహాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల సుదీర్ఘ ద్వైమాసిక ఎంపీసీ సమావేశం తర్వాత ఈ కమిటీ రెపో రేటు(4 శాతం), రివర్స్ రెపో రేట్ల(3.35 శాతం)ను మార్చకుండా ఆదేవిదంగా ఉంచింది. రెపో రేట్‌ యథాతథంగా ఉంచడంతో బ్యాంకులు రుణదాతలకు ఇచ్చే వడ్డీ రేట్లు అలాగే ఉంచే అవకాశం ఉంది.

కొత్త ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయం..!

రియల్‌ ఎస్టేట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం గృహనిర్మాణ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. దీంతో కొంత ఇంటిని కొనుగోలుదారులు చేసే వారికి తక్కువ వడ్డీకే రుణాలను పొందుతారు. ప్రస్తుతం చాలా ప్రముఖ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు అందించే వడ్డీ రేట్లు 6.4-6.9 శాతం మధ్య ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం రికవరీ వైపు రావడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏబీఏ కార్పోరేషన్‌ డైరెక్టర్, క్రెడాయ్‌ వెస్ట్రన్ యూపీ ప్రెసిడెంట్ అమిత్ మోడీ అభిప్రాయపడ్డారు. తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉన్నందున ఇప్పటికీ కొత్త గృహాలను కొనుగోలు చేయగల గృహ కొనుగోలుదారులకు ఇది సానుకూలంగా ఉంటుందని భారతీయ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ సీఈఓ-రెసిడెన్షియల్, అశ్విందర్ ఆర్.సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles