Grama Suraksha Scheme: ఇండియా పోస్ట్ ఆఫీస్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు మన దేశంలో. మొదట్లో ఉత్తరాలకు సంబంధించిన సేవలు అందిస్తూ వస్తున్న పోస్టు ఆఫీస్ రాను రాను పెట్టుబడి పథకాలు, బ్యాంకు సంబంధిత సేవలు కూడా అందిస్తుంది. పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలను ఇండియా పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. మార్కెట్ లో ఉన్న పథకాలతో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పనితీరుపై ఆధారపడవు కాబట్టి పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం.
కాబట్టి, సురక్షితమైన పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఉన్న పథకాలలో మంచి రాబడి ఇచ్చే పథకాలలో ‘గ్రామ సురక్షా పథకం‘ ఒకటి. ఈ పథకం కింద పెట్టుబడిదారులు ప్రతి రోజు కేవలం రూ.50 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత రూ.35 లక్షల వరకు పొందవచ్చు. 9 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడు అయినా ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద కనీస రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
(ఇది చదవండి: అప్పుడు ఎకరం రూ.40 లక్షలు..! ఇప్పుడు రూ.3 కోట్లు..!)
ఈ పథకం ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు. పెట్టుబడిదారులు ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ పథకాన్ని మూడు సంవత్సరాలల తర్వాత సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు మీరు గ్రామ సురక్ష పథకాన్ని వద్దునుకుంటే బోనస్ ప్రయోజనం లభించదు. ఒక వ్యక్తి పోస్టాఫీసు పథకంలో 19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన సురక్ష పాలసీని కొనుగోలు చేసినప్పుడు 55 సంవత్సరాల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. 55 సంవత్సరాల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు రూ.58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు వరకు లభిస్తుంది.