How much Gold can Buy in Cash without ID Proof in Telugu: దేశంలో త్వరలో వరుసగా దసరా, ధంతేరాస్, దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ పండుగల సందర్భంగా చాలామంది మహిళలు సాంప్రదాయకంగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు అనే విషయం మనకు తెలిసిందే.
ముఖ్యంగా నవంబర్ నెలలో వచ్చే ధనత్రయోదశి నాడు పసిడి, వెండి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా త్వరలో రాబోతుంది. అయితే, మీరు నగదుతో పసిడి కొనుగోలు చేయాలని చూస్తే.. మీరు ఈ కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.
(ఇది కూడా చదవండి: Gold Purity Check : బంగారం నాణ్యత ఎలా చెక్ చేయాలో తెలుసా?)
కేంద్ర ప్రభుత్వం జువెల్లరీ రంగాన్ని 2002లో ‘అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA)’ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి డిసెంబరు 2020లో ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అందులో భాగంగానే ఒక పరిమితికి మించి నగదుతో పసిడి, వెండి కొనుగోలు చేసే వారి నుంచి ఆభరణాల సంస్థలు పాన్, ఆధార్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందనే నిబంధన విధించింది.
నగదుతో ఎంత బంగారం కొనవచ్చు?
రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో నగలు కొనుగోళ్లు చేసేవారి వివరాలను ప్రభుత్వానికి నివేదించాలి. ఆదాయ పన్ను(Income Tax) సెక్షన్ 269ఎస్‌టీ ప్రకారం.. నగల కొనుగోలు చేసేటప్పుడు ఒకరోజులో ఒక వ్యక్తి రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో కొనకూడదు. ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో ఆభరణాలు కొంటె ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించినట్లవుతుంది.
జరిమానా ఎంత చెల్లించాలి?
ఆ సందర్భంలో ఎవరైతే నగదును స్వీకరించారో వాళ్లు.. ఆ లావాదేవీ మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఓ నగల దుకాణంలో రూ.4 లక్షల విలువ చేసే ఆభరణాలను నగదుతో కొనుగోలు చేస్తే.. అప్పుడు మీరు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్‌టీ ఉల్లంఘించినట్లే. ఈ క్రమంలో మీ దగ్గర నగదు తీసుకున్న నగల వ్యాపారి.. రూ. 4 లక్షలు పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో నగలు కొనాలంటే.. కచ్చితంగా పాన్ లేదా ఆధార్ సమర్పించాల్సి ఉంటుంది. ఐటీ చట్టంలోని నిబంధన 114బీ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. అయితే, ఇక్కడ నగదుతో చెల్లిస్తున్నారా లేక ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నారా అనే దానితో సంబంధం లేదు. మీరు కొనుగోలు చేసే పసిడి విలువ రూ.2 లక్షలు దాటితే తప్పనిసరిగా పాన్ లేదా ఆధార్ సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఈ క్రింది ఉన్న లింక్స్ ఫాలో అవ్వండి:
టెక్ పాఠశాల వాట్సాప్ చానెల్: https://whatsapp.com/channel/0029VaAjDNLCcW4hxsv3pk1N
టెక్ పాఠశాల ఫేస్బుక్ పేజీ: https://www.facebook.com/TechPatashala/
టెక్ పాఠశాల ట్విట్టర్ పేజీ: https://twitter.com/TechPatashala
టెక్ పాఠశాల టెలిగ్రాం గ్రూప్: https://t.me/techpatashala7