Home Loan Income Tax Benefits: మీరు గృహ రుణం తీసుకున్నారా? అయితే మీకు శుభవార్త. భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల క్రింద గృహ రుణ గ్రహీతలు తాము చెల్లించే ఆదాయపు పన్నుపై రాయితీలను పొందవచ్చు. ఈ క్రింద పేర్కొన్న సెక్షన్‌ల ప్రకారం మీ హోమ్ లోన్ రీపేమెంట్ కాలవ్యవధి పూర్తి అయ్యే వరకు, మీ లోన్ అసలు & వడ్డీ రెండింటిపై ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది.
- సెక్షన్ 80C
- సెక్షన్ 24
- సెక్షన్ 80EEA
- సెక్షన్ 80EE
సెక్షన్ 80C
సెక్షన్ 80C కింద, మీరు రుణ దాత నుంచి తీసుకునే అప్పు(ఉదా: 50 లక్షలు అనుకుంటే) మీద ప్రతి సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.
(ఇది కూడా చదవండి: Home Loan Documents List: హోమ్ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి?)
స్టాంప్ డ్యూటీ: మీ ఇంటి రిజిస్ర్టేషన్ కోసం చేసిన ఖర్చులు , స్టాంప్ డ్యూటీ, ఇతర వ్యయాలపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే చెల్లించిన ఏడాది క్లెయిమ్ చేసుకోవాలి.
సెక్షన్ 80C: షరతులు
- మీరు ఇల్లు కట్టినప్పుడు & ఇల్లు కొనుగోలు చేసినప్పుడు దీనిని కింద పన్ను రాయితీ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
- ఇల్లు నిర్మాణ కాల పరిమితి: మీరు గృహ నిర్మాణం కోసం రుణం తీసుకున్నట్లయితే, ఆ రుణం తీసుకున్న ఐదేళ్లలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
- ఇల్లు కొనుగోలు చేసిన ఐదేళ్లలోపు అమ్మకూడదు. ఒకవేళ విక్రయించినట్లయితే, మీరు అప్పటి వరకు క్లెయిమ్ చేసిన పన్ను రాయితీ తగ్గింపులు తిరిగి ఆ తర్వాత చెల్లించే పన్ను చెల్లింపులో తిరిగి నమోదు అవుతాయి.
- అమ్మకం అసెస్‌మెంట్ సంవత్సరంలో తదనుగుణంగా పన్ను విధించబడతాయి.
- క్లెయిమ్ ఆధారం: సెక్షన్ 80C కింద మినహాయింపులు వార్షికంగా చెల్లించిన అసలు మొత్తంపై మాత్రమే క్లెయిమ్ చేస్తారు.
సెక్షన్ 24
ఈ సెక్షన్ 24 ప్రకారం, మీరు గృహ రుణ వడ్డీ చెల్లింపుపై సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
సెక్షన్ 24: షరతులు
- ఆస్తి నిర్మాణం మరియు ఆస్తి కొనుగోలు కోసం వీటిని క్లెయిమ్ చేసుకోవచ్చు
- మీరు గృహ నిర్మాణానికి రుణం తీసుకున్నట్లయితే, గృహ రుణం తీసుకున్న ఐదేళ్లలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి. రుణం తీసుకున్న ఐదేళ్లలోపు ఇల్లు నిర్మించుకోకుంటే రూ.30,000 మినహాయింపు ఉంటుంది. రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం చివరి నుండి ఈ వ్యవధి ప్రారంభమవుతుంది.
- నిర్మాణం పూర్తయిన సంవత్సరం నుండి ఈ క్లెయిమ్ వర్తిస్తుంది.
- అలాగే, మీరు రుణం పై చెల్లించవలసిన వడ్డీ కోసం అందుబాటులో ఉన్న వడ్డీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ఈ రుణం ఏప్రిల్ 1, 1999 తర్వాత తీసుకోవాలి.
- ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి బ్యాంక్ నుంచి వడ్డీ సర్టిఫికేట్ తప్పనిసరి.
- సెక్షన్ 24 కింద తగ్గింపులు మీకు వచ్చిన అనుమతులపై అందిస్తారు, అనగా, వడ్డీ ప్రతి సంవత్సరానికి విడిగా లెక్కిస్తారు మరియు అసలు చెల్లింపు చేయనప్పటికీ, రాయితీని క్లెయిమ్ చేయవచ్చు.
సెక్షన్ 80EEA
భారతదేశంలో మొదటిసారి గృహ రుణం తీసుకొని కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే మీరు చెల్లించే ఆదాయపు పన్నుపై అదనపు తగ్గింపులను పొందుతారు. సెక్షన్ 80EEA ప్రకారం, భారతదేశంలో మొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తి, సెక్షన్ 24 కింద అందించిన పరిమితికి మించి, గృహ రుణ వడ్డీ చెల్లింపుపై సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు అదనపు పన్ను మినహాయింపును పొందవచ్చు.
సెక్షన్ 80EEA: షరతులు
- గృహ రుణం ఏప్రిల్ 1, 2019 – మార్చి 31, 2022 మధ్య కాలంలో తీసుకోవాలి.
- సెక్షన్ 80EE కింద తగ్గింపులను క్లెయిమ్ చేయని కొనుగోలుదారులు మాత్రమే సెక్షన్ 80EEA కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.
- అలాగే, కొనుగోలు చేసిన ఆస్తి విలువ రూ.45 లక్షలకు మించకూడదు.
- బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకోవాలి
సెక్షన్ 80EE
సెక్షన్ 80EE కింద, మీ గృహ రుణ వడ్డీ చెల్లింపుపై సంవత్సరానికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ తగ్గింపు భారతదేశంలో మొదటిసారి గృహ కొనుగోలుదారులకు మాత్రమే అందిస్తారు. సెక్షన్ 24 కింద అందించబడిన రూ. 2-లక్షల తగ్గింపుపై మరియు అంతకంటే ఎక్కువ వర్తిస్తుంది.
గృహ యాజమాన్యాన్ని లాభదాయకంగా మార్చడానికి సెక్షన్ 80EE 2013-15 ఆర్థిక సంవత్సరంలో రెండేళ్లపాటు ప్రవేశపెట్టబడింది. ఇది మొదటిసారి గృహ రుణం తీసుకునే వారి కోసం వర్తిస్తుంది.
సెక్షన్ 80EE: షరతులు
- ఏప్రిల్ 1, 2016 నుంచి మార్చి 31, 2017 వరకు మధ్యలో తీసుకోవాలి.
- ఆస్తి విలువ: రూ. 50 లక్షలకు మించకూడదు
- రుణం విలువ రూ. 35 లక్షల వరకు ఉండాలి.
- బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకోవాలి
- సెక్షన్ 24 కింద అందించబడిన మాఫీ ముగిసిన తర్వాత మాత్రమే మీరు సెక్షన్ 80EE కింద రాయితీని క్లెయిమ్ చేయవచ్చు.
- మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడం కోసం మీరు తప్పనిసరిగా రుణ దాత బ్యాంక్ జారీ చేసిన వడ్డీ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.