Monday, November 4, 2024
HomeAutomobileCheapest Electric Scooters: ఈవీ మార్కెట్లో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Cheapest Electric Scooters: ఈవీ మార్కెట్లో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Cheapest Electric Scooters In India: గతంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో, ఇప్పుడు సాధారణ ప్రజానీకం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారుల కోరిక మేరకు అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొని వస్తున్నాయి.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన రియల్ 5టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రేంజ్ కూడా అదుర్స్!)

వాటికి వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈవీ మార్కెట్లో చాలా ఖరీదైన, ప్రజల బడ్జెట్‌కు సరిపోని ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో చాలా ఉన్నాయి. ఇటువంటిపరిస్థితిలో చాలా చౌకగా మీ బడ్జెట్‌కు సరిపోయే టాప్ – 5 చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.

Avon E Scoot

ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్ 65 కి.మీల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం 24KMPH, 215W BLDC మోటార్ & 48V/20AH బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుంది.

Bounce Infinity E1

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,099(బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 65kmph, 85km రేంజ్ కలిగి ఉంటుంది అని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

Hero Electric Optima CX

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్(సింగిల్ బ్యాటరీ వేరియంట్) ధర రూ.62,190. ఈ స్కూటర్ గరిష్ట వేగం 45 KM/H & 82KM రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు రంగులలో లభిస్తుంది. ఇది 51.2V/30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 4 నుండి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

Hero Electric Photon

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ 1200W మోటార్‌తో జతచేసిన 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. 5 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ 90 కిమీల రేంజ్‌తో వస్తుంది. దీని ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీ. ఫీచర్ల పరంగా ఇది LED హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్, అలాగే అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

Ampere Magnus EX

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది 1.2 kW మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఇది 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 121 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.73,999.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles