Top-5 Income Tax Saving Tips in Telugu: సమయం దగ్గరపడుతుందని ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం .ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ ఆర్టికల్ మొత్తం చదివన తర్వాతే ట్యాక్స్ ఫైల్ చేయండి. డబ్బు కూడా ఆదా అవుతుంది.
2023-2024 ఆర్ధిక సంవత్సరానికి (అంటే.. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు) ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 వరకు గడువు ఉంది. అయితే ఈ సందర్భంగా ఎవరైతే పన్ను చెల్లిస్తున్నారో వారు.. కొన్ని పద్దతుల ద్వారా ట్యాక్స్ ఆదా చేయొచ్చు. వాటిల్లో
1.హెచ్‌యూఎఫ్ (HUF)
హెచ్‌యూఎఫ్ (HUF) అంటే హిందూ అవిభక్త కుటుంబం అని అర్ధం.చట్ట ప్రకారం.. ఈ హెచ్ యూఎఫ్ లోని సెక్షన్ 80సీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు (ట్యాక్స్ పేయర్స్) ఆర్ధిక సంవత్సంలో రూ.1.5లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. వీరితో పాటు విడిగా ట్యాక్స్ పే చేసే వారు సైతం ఈ సెక్షన్ 80సీతో రూ.1.5లక్షల వరకు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. ఇలా ట్యాక్స్ ఆదా చేయాలంటే మీరు ఓల్డ్ ట్యాక్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- సెక్షన్ 80సీలో పన్ను ఆదా చేసుకునే మార్గాలలో
- ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
- ఫిక్స్ డ్ డిపాజిట్లు (టెన్యూర్ 5 కంటే ఎక్కువ)
- లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు
- ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్
- నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్)ఇతర పెన్షన్ ప్లాన్లు ఉన్నాయి.
2.జీతం పొందే ఉద్యోగుల కోసం
జీతం పొందే ఉద్యోగులు యజమాని అందించిన జీతంతో సైతం పన్ను ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు, అద్దెకు తీసుకుంటే ఇంటి అద్దె అలవెన్స్ (HRA) ఎంచుకోవడం, టెలిఫోన్/ఇంటర్నెట్ ఖర్చులు, విద్యా భత్యాలు, ఫుడ్ కూపన్‌లు మొదలైన వాటికి రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. తద్వారా మీరు తీసుకునే జీతంపై చెల్లించే ట్యాక్స్ పై తగ్గింపులు/మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు.
3. వీపీఎఫ్ (Voluntary Provident Fund)
ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ ఎలా డిడక్ట్ అవుతుందో.. వీపీఎఫ్ కూడా అలా శాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పీఎఫ్ తో పాటు వీపీఎఫ్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే..మీరు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మీరు వీపీఎఫ్ అకౌంట్ లో 1.5 లక్షలలోపు పెట్టుబడి ఉంటే సెక్షన్ 80సీ ద్వారా మీరు కట్టే ట్యాక్స్ తగ్గుతుంది.
4. హోంలోన్ పై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు
మీరు బ్యాంక్ లు లేదంటే ఫైనాన్స్ కంపెనీల నుంచి హోంలోన్ కనుక తీసుకుని ఉంటే.. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలలోపు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
5 హెల్త్ ఇన్సూరెన్స్ పై ట్యాక్స్ బెన్పిట్స్
ఆదాయపు పన్ను నిబంధనలు తనకు, జీవిత భాగస్వామికి, ఆధారపడిన పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్స్ ఖర్చులతో పాటు జీవిత భాగస్వామి,పిల్లలకు రూ.25వేల వరకు తల్లిదండ్రులకు రూ.50వేల వరకు ట్యాక్స్ మినిహాయింపు పొందవచ్చు.