ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ముఖ్యగమనిక. ఆర్ధిక సంవత్సరం 2024-25 నాటికి జులై1 లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటిఆర్‌లు) దాఖలు చేయాల్సి ఉంది. ఒకవేళ అప్పటి వరకు ఐటీ దాఖలు చేయకపోతే ఆర్ధిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇంతకీ ట్యాక్స్ ఎవరు చెల్లించాల్సి ఉంటుందో మీకు తెలుసా.
వ్యక్తులు, కంపెనీలు,ఇతర పన్ను చెల్లింపుదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటిఆర్‌లు) దాఖలు చేయాలి. అంటే మీరు సంపాదించే సంపాదనపై అది శాలరీ కావొచ్చు. బిజినెస్’లో వచ్చే ఆదాయంపై కావొచ్చు. వాటి ఆధారంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు జులై31 లోపు చెల్లించినట్లైతే మీకు కొన్ని పన్ను ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ట్యాక్స్ పై ప్రయోజనాలు పొందాలనుకుంటే పాత పన్ను, వద్దనుకుంటే కొత్త ట్యాక్స్ విధానంలో మీరు సచెల్లించాలి.
జులై 31లోపు చెల్లించకపోతే తలెత్తే ఆర్ధికపరమైన ఇబ్బందులు
ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 234F ప్రకారం, ఒక వ్యక్తి ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్ లను (అంటే, గడువు తర్వాత) ఫైల్ చేస్తే జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం, ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులపై రూ. 5,000 జరిమానా విధించబడుతుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు మించని పన్ను చెల్లింపుదారులు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అదనపు పన్నులు చెల్లించనప్పటికీ పెనాల్టీ విధించబడుతుంది.
వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది
అంతేకాదు సెక్షన్ 234ఏ కింద మీరు సకాలంలో పన్ను చెల్లించనందుకు , దానిపై వడ్డీని కూడా మీరు చెల్లించాలి. సెక్షన్లు 234B, 234C కింద వడ్డీ పెనాల్టీ కూడా వర్తింస్తుంది. ముందస్తు పన్ను చెల్లింపులు వాయిదా వేసినా లేదా చెల్లింపులో జాప్యం జరిగినా సెక్షన్ 234A/B/C కింద జరిమానా వడ్డీ నెలకు 1శాతం కట్టాలి.
నష్టాలను పూడ్చుకోలేం
పెనాల్టీ చెల్లించడమే కాకుండా, ఆలస్యంగా దాఖలు చేసిన వ్యక్తి వ్యాపారం నష్టపోతే.. ఆ నష్టాల నుంచి బయటపడలేరు. ఎలా అంటే రమేష్ అనే వ్యక్తి తన నిర్వహణకు కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. కొన్ని సందర్భాలలో వ్యాపారం నిర్వహణకు పెట్టిన మొత్తంలో నష్టం రావొచ్చు. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే గడువు తేదీ కంటే ముందే ఐటీ రిటర్న్ దాఖలు చేసే సమయంలో వ్యాపార నిర్వహణకు కేటాయించిన మొత్తానికి నష్టం వచ్చిందని, అందుకు నేను ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ ను కొంత వరకు తగ్గించమని అదాయపన్ను శాఖను కోరవచ్చు. సంబంధిత వివరాలు ఐటీఆర్ ఫైలింగ్ లో ఉంటాయి.