Tuesday, October 15, 2024
HomeBusinessLIC WhatsApp Services: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవలు.. ఎలా పొందాలి?

LIC WhatsApp Services: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవలు.. ఎలా పొందాలి?

LIC WhatsApp Services in Telugu: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ(LIC) తన బీమా పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఇక నుంచి పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్‌ ఇతర వంటి సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు తెలిపింది. ఎల్‌ఐసీ వాట్సాప్ సర్వీస్‌లను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు బీమా సంస్థ పేర్కొంది.

(ఇది కూడా చదవండి: హోమ్ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి?)

ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్‌ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ ట్వీట్‌ వేదికగా పేర్కొన్నారు. తమ పాలసీ వివరాలను ఎల్‌ఐసీ పోర్ట్‌లో రిజస్టర్‌ చేసుకున్న రిజిస్టర్డ్‌ మెంబర్స్‌కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తను తెలిపారు.

వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవలు పొందడం ఎలా?

రిజిస్టర్డ్‌ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ నుంచి 8976862090 నంబర్‌కు Hi అని మెసేజ్‌ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా వాట్సాప్‌లో పొందవచ్చు. వాట్సాప్‌లో ఏ రకమైన ఎల్‌ఐసీ పొందవచ్చు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  • ప్రీమియం బకాయి (Premium Due)
  • బోనస్ సమాచారం (Bonus Information)
  • పాలసీ స్థితి (Policy Status)
  • లోన్ అర్హత కొటేషన్ (Loan Eligibility Quotation)
  • లోన్ రీపేమెంట్ కొటేషన్ (Loan Repayment Quotation)
  • చెల్లించవలసిన రుణ వడ్డీ (Loan Interest Due)
  • ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ (Premium Paid Certificate)
  • ULIP-యూనిట్‌ల స్టేట్‌మెంట్ (ULIP -Statement of Units)
  • LIC సర్వీస్ లింక్‌లు (LIC Services Links)
  • సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం (Opt in/Opt Out Services)

వెబ్‌సైట్‌లో ఎల్‌ఐసీ సేవలను ఎలా నమోదు చేసుకోవాలి?

  • ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ‘కస్టమర్ పోర్టల్’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే ‘న్యూ యూజర్‌’పై ప్రెస్ చేయండి.
  • బేసిక్‌ సర్వీసెస్‌లో వినియోగదారు ID, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
  • ఆ తర్వాత పాలసీ వివరాలను నమోదు చేసి యాడ్‌ పాలసీని సెలెక్ట్‌ చేసుకోండి.
  • దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో రిజిస్టర్‌ అవుతాయి.

ఇంకా ఏమైనా సహాయం కావాలంటే కింద మీ పేరు, మొబైల్ నెంబర్ కామెంట్ చేయండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles