Thursday, March 28, 2024
HomeBusinessదీపావళి ముందు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

దీపావళి ముందు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

దీపావళికి ముందు సామాన్యుడికి పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంట్లో ఏదైనా ఉండాలి అన్న, బయటకి ఎక్కడికి వెళ్లాలి అన్న సామాన్యుడు బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండూ రోజుల విరామం ఇచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో చమరు ధరలు జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా 30 నుండి 36 పైసల మధ్య పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర నేడు 40 పైసలకు పైగా పెరిగింది. ఇక తాజాగా ఈరోజు పెరిగిన ధరలతో పెట్రోల్ రేటు హైదరాబాద్ లో రూ.114.13 కు చేరుకుంది.

అంతే కాకుండా డీజిల్ ధర రూ.107.40 కు చేరుకుంది. నిన్న పెట్రోల్ పై 35 పైసలు పెరగ్గా.. డీజిల్ పై 37 పైసలు పెరిగింది. ఇక ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఎల్‌పీజీ గ్యాస్ ధరలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.265 పెరిగింది.

డోమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ ధరల విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,733 నుంచి రూ.2,000 వరకు పెరిగింది. చమురు ధరలు ప్రతి రోజు సవారిస్తూ ఉంటే, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా పెరిగాయి.

(ఇది కూడా చదవండి: జియో నెక్ట్స్‌ ఫోన్ కొంటున్నారా.. అయితే ఈ మొబైల్స్ కూడా చూడండి!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles