Wednesday, January 29, 2025
HomeBusinessFD Rates: పోస్టాఫీస్ ఎఫ్‌డీ X ఎస్‌బీఐ ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఏది మంచిది?

FD Rates: పోస్టాఫీస్ ఎఫ్‌డీ X ఎస్‌బీఐ ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఏది మంచిది?

Fixed Deposit Rates Details in Telugu: పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, వృద్ధాప్యంలో పెన్షన్ కోసం, ఆపత్కాలంలో ఎవరిని చేబదులు అడిగే అవసరం లేకుండా బ్యాంకులు, పోస్టాఫీసులు ఖాతాదారులు డిపాజిట్ చేసిన అసలు మొత్తానికి వడ్డీని అందిస్తుంటాయి. ఆ వడ్డీ దేశ ఆర్ధిక స్థితిగతులపై ఆదారపడతాయి. కొన్ని సార్లు ఆర్ధిక ఇబ్బందులు నెలకొన్నా వడ్డీ రేట్లలో తగ్గింపు ఉండదు.

అందుకే ఎక్కువ శాతం మంది సురక్షిత పెట్టుబడిగా బ్యాంక్ లలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఫోస్టాఫీసుల్లో టర్మ్ డిపాజిట్లు చేస్తుంటారు. అలా చేసే ముందు కాస్త ఆలోచించి డబ్బును ఆదా చేసుకోవాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. లేదంటే భారీ మొత్తంలో డబ్బును నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

పోస్టాఫీస్ ఎఫ్‌డీ X ఎస్‌బీఐ ఎఫ్‌డీ

ఎస్‌బీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వర్సెస్ పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు ఈ రెండింటిలో ఏది మంచిది అని అడిగితే.. డిపాజిట్ చేసిన మొత్తానికి ఎక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో మనకు వడ్డీ వస్తే అదే మంచిది.

ఉదాహరణకు ..ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఐదేళ్ల కాలవ్యవధికి అందించే వడ్డీ రేటు, అదే కాలవ్యవధికి పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్‌తో పోలిస్తే..ఎస్‌బీఐ అందించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. పోస్టాఫీస్ కంటే బ్యాంక్ అందించే వడ్డీ 1.3శాతం తక్కువగా ఉంది.

- Advertisement -

(ఇది కూడా చదవండి: పాత ట్యాక్స్ రెజిమ్ Vs కొత్త ట్యాక్స్ రెజిమ్.. ఈ రెండింటిలో ఏ ట్యాక్స్ మంచిది)

ఒకవైపు, ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 5.4శాతం ఉంటే, పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు ఐదేళ్లపాటు పెట్టుబడి పెట్టినప్పుడు 6.7శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఏప్రిల్ 01 2020 నుండి ఐదేళ్ల పాటు అంటే 2025 వరకు పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ల కోసం కొత్త వడ్డీ రేట్లు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు , మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు 5.5శాతం వడ్డీని అందిస్తుంటే ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, రేటు వడ్డీ 6.7శాతం వడ్డీని అందించడం గమనార్హం.

ఉదాహరణ కోసం, మనం ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో ఐదేళ్లపాటు రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే అదే కాలవ్యవధికి పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే ఆ రెండింట్లో ఎక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని పరిశీలిస్తే

ఐదేళ్ల ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రూ.1 లక్ష ప్లస్ రూ. 64, 362 వడ్డీని కలిపితే చివరికి మొత్తంగా మనకు రూ. 1, 64, 362 వస్తుంది. అదే పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్‌లో ఈ డబ్బు ఐదు సంవత్సరాలలో రూ.2, 00, 016 పొందవచ్చు. దాన్ని బట్టి ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్‌లో డబ్బు రెట్టింపు అవుతుందని ఇది స్పష్టంగా చూపిస్తుంది.

(ఇది కూడా చదవండి: Tax Saving Tips: ఆదాయ పన్ను మినహాయింపు అందించే 5 సెక్షన్లు ఇవే!)

అందువల్ల, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ,పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి. ఇక్కడ, ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్, పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..అంతకంటే ముందే ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై వడ్డీ రేట్లు (రెపో రేట్లు) దేశ ఆర్ధిక పరిస్థితులను బట్టి మారుతుంటాయి. పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంటాయి.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే

పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే

తెలివైన పెట్టుబడిదారుడిగా, పెట్టుబడికి సంబంధించిన అన్ని పథకాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎస్‌బీఐ, పోస్టాఫీస్ రెండూ ప్రభుత్వ బ్యాకప్ పథకాలు అయినప్పటికీ, మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ల కంటే పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మొదలైన అనేక ఇతర పెట్టుబడి పథకాలు అధిక మొత్తంలో వడ్డీని అందిస్తాయి. దాదాపు ఈ పథకాలన్నీ ఏడు శాతం ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. ఈ పథకాలపై వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారతాయి గుర్తుంచుకోవాలి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles