Monday, October 14, 2024
HomeBusinessITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటితే ఎంత ఫైన్ కట్టాలి?

ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటితే ఎంత ఫైన్ కట్టాలి?

ITR Filing: ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. జులై 31 చివరి తేదీగా ఉండడంతో ట్యాక్స్ పేయిర్స్ తమ ట్యాక్స్ చెల్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయని ట్యాక్స్ పేయర్స్ ఫైన్ చెల్లించాల్సి వస్తుందా? ఒక వేళ ఫైన్ ఎంతకట్టాలి?

ఇన్ కమ్ ట్యాక్స్ లా ప్రకారం.. గడువు తేదీ లోపు (జులై౩1) ఐటీఆర్ ఫైల్ చేయనందుకు ట్యాక్స్ పేయర్స్ ఫైన్ కట్టాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కేవలం మీరు ఎంత ట్యాక్స్ చెల్లిస్తున్నారో దాన్ని బట్టి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్లందరూ గడువు ముగిసేలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అదనంగా ఎలాంటి ఛార్జీలు కట్టే పని లేదు గమనించండి.

పెనాల్టీ ఎంత వరకు చెల్లించాలి?

సెఓన్ 234ఎఫ్ ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 1996 డెడ్ లైన్ లోపే ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేదంటే అదనపు ఛార్జీలు తప్పసరిగా చెల్లించాలి. డెడ్ లైన్ తర్వాత ట్యాక్స్ ఫైలింగ్ చేసే వారిని బిలేటెడ్ ఐటీఆర్ అని పిలుస్తారు. నిర్ధేశించిన గడువు దాటితే ట్యాక్స్ పేయర్స్ రూ.5 వేలు చెల్లించాలి. ఎవరి ఆదాయం ఐదు లక్షల దాటదో వారు రూ.వెయ్యి కడితే సరిపోతుంది.

ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ఎలాంటి పన్ను చెల్లించనప్పటికీ పెనాల్టీ విధించబడుతుందని గుర్తుంచుకోండి. ఐటీఆర్ ఫారమ్‌లో ఆలస్యమైన ఐటిఆర్‌ను సమర్పించి, ఆలస్యమైన ఫైలింగ్ రుసుము చెల్లింపుకు సంబంధించిన చలాన్ వివరాలను మాత్రమే ధృవీకరించవచ్చు.

- Advertisement -

గడువు దాటితే ఫైన్ చెల్లించాల్సిన ట్యాక్స్ పేయర్స్ ఎవరు?

ఇన్ కమ్ ట్యాక్స్ చట్టాల ప్రకారం.. మూడు విభాగాలకు చెందిన ట్యాక్స్ పేయర్స్ మాత్రమే నిర్ణీత గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే లేట్ ఫైలింగ్ ఫీజులు కట్టాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితిని మించి ఉంటే, ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా కట్టాలి. పన్ను చెల్లింపుదారుకు వర్తించే ప్రాథమిక మినహాయింపు పరిమితి ఎంచుకున్న పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది.

న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ పేయర్స్ వయస్సుకు అనుగుణంగా వారికి వచ్చే ఆదాయంపై ముడు లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం.. 60ఏళ్ల లోపు వారికి రూ.2.5 లక్షల వరకు, 60 నుంచి 80 మధ్య వయస్సు వారికి రూ.3లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టే పనిలేదు. ఒకవేళ దాటితే ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. 80ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.

(ఇది కూడా చదవండి: పంట రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. వీళ్లు మాత్రమే అర్హులు!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles