Sunday, November 24, 2024
HomeBusinessPublic Provident Fund Scheme: నెలకు వెయ్యి రూపాయల పెట్టుబడితో.. రూ.26.32 లక్షలు సంపాదించండి!

Public Provident Fund Scheme: నెలకు వెయ్యి రూపాయల పెట్టుబడితో.. రూ.26.32 లక్షలు సంపాదించండి!

Public Provident Fund Scheme: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బు భాగ సంపాదించి మంచిగా జీవితాన్ని గడపాలని అందరూ అనుకుంటారు. కానీ, కొందరు మాత్రమే డబ్బు సంపాదించడంలో విజయవంతులు అవుతారు. డబ్బు సంపాదించడం అంటే కేవలం బిజినెస్, ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బులు మాత్రమే కాదు.

ఇలా మనం సంపదిస్తున్న దాంట్లో నుంచి మన అవసరాలు ఎంత పొదుపు చేస్తున్నాము అనేది కూడా ముఖ్యం. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ చేసే నాటికి అంతా పెద్ద మొత్తంలో పెన్షన్ రూపంలో వస్తుంది.

ఎందుకంటే, ప్రతి నెల కొంత మొత్తం కట్ చేసుకొని మిగతా జీతాన్ని వారికి అందజేస్తాయి. అలా అసంఘటిత రంగాలకు చెందిన వారు కూడా ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేయడం లేదా పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

మీరు కనుక పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్, భూముల మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. కానీ స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలంటే మాత్రం కొంచెం రిస్క్ ఎక్కువ అని చెప్పుకోవాలి. అలాగే, అదే మొత్తంలో డబ్బు వస్తుంది అనే విషయం మరిచిపోవద్దు.(ఇది కూడా చదవండి: 5 నెలల్లో 65 వేల కోట్ల ఏలోన్ మస్క్ సంపద ఆవిరి)

ఇక తర్వాత కొంచెం రిస్క్ తక్కువ అయిన భూములు మీద పెట్టుబడి పెడితే చాలా మంచి ఫలితాలు కనబడుతాయి. కానీ దీనికి భారీ మొత్తంలో పెట్టుబడి అవసరం కొన్ని ప్రత్యేక సందర్భాల్లొ ఆశించినంత డబ్బులు రాకపోవచ్చు. ఇక తర్వాత ఉన్న మరో ఆప్షన్ ప్రభుత్వ సంబందిత వాటిలో పొదుపు చేయడం.

- Advertisement -

ఇది ఒక మధ్య తరగతి కుటుంబాల వారికి మంచిగా సరిపోతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇందులో ఎటువంటి రిస్క్ లేకపోవడమే కాకుండా మనం పెట్టుబడి పెట్టిన నగదుపై కచ్చితంగా ముందే మనం అనుకున్నంత రాబడులు వస్తాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident Fund Benefits)

ఇప్పడు అలాంటిదే ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. మీరు దీర్ఘ కాలం పెట్టుబడి పెట్టాలని సిద్ధపడితే ఇది మీకు సరైన ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ ఇందులో మీకు వచ్చే రిటర్నులు భారీగా పెరుగుతాయి. ఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ.1000 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌(Public Provident Fund)లో పెట్టుబడి పెడితే దీర్ఘ కాలంలో మంచి రిటర్న్ లభిస్తాయి. దాదాపు రూ.26 లక్షలు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడ మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అందులో జమ చేసిన నగదుపై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. ఇందులో ఏడాదికి కనీసం రూ.500 నుంచి లక్షన్నర దాకా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ 15 సంవత్సరాల్లో మెచూర్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా మరో ఐదేళ్లకు పెంచుకుంటూ పోవచ్చు.

ఒక వ్యక్తి నెలకు రూ.1000 చొప్పును 15 ఏళ్లు పెట్టుబడి పెడితే మొత్తం డిపాజిట్ రూ.1.80 లక్షలు అవుతుంది. తద్వారా 15 ఏళ్ల తర్వాత రూ.3.25 లక్షలు రిటర్న్ పొందగలరు. ఎందుకంటే 7.1 శాతం చొప్పున వడ్డీ రూపంలో మీకు రూ.1.45 లక్షలు లభిస్తుంది. ఒకవేల నెలకు మీరు రూ.2000 పెట్టుబడి పెడితే 15 ఏళ్ల తర్వాత 7.1 శాతం వడ్డీ రేటుతో మీకు మొత్తం రూ. 6,50,913 రూపాయలు వస్తాయి.

ఒకవేళ మీరు ఆ డబ్బు తీసుకోకుండా మరో ఐదేళ్లకు పెంచుకుంటే నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడుతూనే ఉంటే మరో 5 ఏళ్ల తర్వాత రూ.3.25 లక్షలు కాస్తా రూ.5.32 లక్షలు అవుతాయి. ఇలా మీరు 40 ఏళ్ల వరకు ప్రతి నెల రూ. జమ చేస్తే మీరు పెట్టుబడి పెట్టిన రూ.4,80,000 7.1 శాతంతో వచ్చే వడ్డీ అక్షరాల రూ.21,52,773. అసలు + వడ్డీ కలిపి మీకు మొత్తం రూ.26,32,773 వస్తాయి. అదే 20 ఏళ్లు పెట్టుబడి పెడితే రూ.5,32,663.

- Advertisement -

ఒకవేళ మీరు 20 ఏళ్ల వయసనప్పుడే ఈ విధానంలో పెట్టుబడితే పోతే 60 ఏళ్లు వచ్చేసరికి రూ.26.32 లక్షలు పొందవచ్చు. అదే మీ కూతురు/ కొడుకు పేరు మీద ప్రతి నెల రూ.1000 25 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే మీకు రూ.8,24,641 వస్తాయి. ఇది వారి భవిష్యత్ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వం భవిష్యత్ కాలంలో వడ్డీ రేటు పెంచే అవకాశం ఉంది. ఇందులో మీకు ఏలాంటి రిస్క్ ఉండదు, కానీ ఓపిక అనేది ఉండాలి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles