Monday, April 29, 2024
HomeGovernmentరైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ నగదు జమ.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ నగదు జమ.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?

PM Kisan Samman Nidhi Status: అన్నదాతలకు ఆర్దిక చేయూతను అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన(PMKSY Scheme). కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. ప్రతి ఏడాది రైతులకు పెట్టుబడి సహాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా ఏడాది కాలంలో మూడు దఫాలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.2000 చొప్పున మొత్తం రూ.6వేల నగదు జమ చేస్తారు. మొదటి విడత నగదును ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రైతుల ఖాతాలలో రూ.2 వేలు జమ చేస్తారు.

2021లో తొలి విడత చెల్లింపులు మే 14న(నిన్న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ కార్యక్రమం ద్వారా పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా లబ్దిదారులైన 9.5 కోట్ల రైతులకు 19,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ ఏడాది పీఎం కిసాన్ పథకంలో భాగంగా అమలు ఉన్న కొత్త నిబందనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల జాబితాలో(Beneficiery List) ఉన్న రైతులకు రూ.2000 అందుతాయి. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ కానున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.(ఇది కూడా చదవండి: పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా?)

పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాలో వెంటనే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్స్ కీ మెసేజ్ లు వస్తాయి. ఒకవేల రాకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. అందులో మే 14 నుంచి ఎప్పుడైనా రూ.2,000 పడ్డాయో లేదో తెలుసుకోండి. అప్పటికీ రాకపోతే ఈ క్రింది విదంగా పేర్కొన్నట్లు చేయండి.

స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?

  • మొదట పీఎం కిసాన్ అధికారిక http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో కనిపించే Farmer Corner ఆప్షన్ కి వెళ్లాలి.
  • Farmer Corner ఆప్షన్ కింద మీకు చాలా ఆప్షన్ లు కనిపిస్తాయి. అందులో Beneficiary Status మీద క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లలో ఏదైనా ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే లబ్ధిదారుల ఖాతా, నగదు వివరాలు తెరమీద కనిపిస్తాయి.

మీకు పీఎం కిసాన్ పోర్టల్ కూడా కనబడకపోతే ముందు అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అందులో పేరు లేకపోయిన, పేరు ఉండి రాకపోయిన పీఎం కిసాన్ టోల్ ఫ్రీ, హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలి.

- Advertisement -

పీఎం కిసాన్ టోల్ ఫ్రీ, హెల్ప్ లైన్ నెంబర్లు:

  • PM Kisan Toll-Free Number: 18001155266
  • PM Kisan Helpline Number: 155261
  • PM Kisan Landline Numbers: 011-23381092, 23382401
  • PM Kisan’s new helpline: 011-24300606
  • PM Kisan helpline: 0120-6025109

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles