Friday, October 18, 2024
HomeBusinessయూఎల్ఐ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తోంది? దాని వల్ల ఉపయోగాలేంటి?

యూఎల్ఐ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తోంది? దాని వల్ల ఉపయోగాలేంటి?

Unified Lending Interface Full Details in Telugu: వినియోగదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. నిన్న మొన్నటి వరకు పట్టణాలు, మెట్రోసిటీల్లో అందుబాటులో ఉండే ఆర్‌బీఐ సేవలు ఇకపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకునే వెసులు బాటు కల్పించనుంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ యూనిఫైడ్ లెండిగ్ ఇంటర్ ఫేస్ (యూఎల్ఐ) పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈసేవల ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రజలకు, చిన్నమొత్తంలో లోన్లు కావాలని అనుకునే వారికి ఉపయోగపడనుంది. ఎలాంటి పేపర్ వినియోగం లేకుండా ఆన్ లైన్ లో సదరు ఖాతాదారులు లోన్లు పొందవచ్చు.

యూఎల్ఐపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ యూఎల్‌ఐ రుణ అవసరాల్ని మార్చగలదని ఆర్‌బీఐ భావిస్తోంది. ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ ఎకోసిస్టమ్‌ను మార్చినట్లే, యూఎల్ఐ కూడా కస్టమర్ల రుణ అవసరాల్ని తీర్చుతుందని మేము ఆశిస్తున్నాము’ని బెంగళూరులో జరిగిన డీపీఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా యూఎల్ఐ గురించి వివరించారు.

యూఎల్ఐ అంటే ఏమిటి?

యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఇది కస్టమర్ల లోన్ అవసరాల్ని సులభతరం చేస్తుంది. ప్రత్యేకించి వ్యవసాయ, మధ్యస్థ చిన్న, సూక్ష్మ పరిశ్రమల (MSME)నిర్వహకులకు లోన్ కావాలంటే యూఎల్ఐ ద్వారా లోన్ కోసం అప్లయి చేసుకోవచ్చు. పేపర్ డాక్యుమెంట్ అవసరం ఉండదు.

యూఎల్ఐ ఎలా పని చేస్తుంది?

యూఎల్ఐ లోన్ ప్రాసెస్ ను సులభతరం చేస్తుంది. ఆర్థిక సేవలకు పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాల్లో భూముల రికార్డ్ లు డేటా సర్వీసు ప్రొవైడర్ల ద్వారా బ్యాంకులు, పలు ఫైనాన్స్ కంపెనీల వద్ద ఉంటాయి. భూమి తనఖా పెట్టి లోన్ తీసుకున్నప్పుడు సంబంధిత ఎవరైతే లోన్ కోసం అప్లయి చేశారు వారి భూముల రికార్డ్ లు బ్యాంకులకు, లేదంటే ఫైనాన్స్ కంపెనీలకు ఇస్తుంటారు. ఆ భూముల రికార్డ్ లను యూఎల్ఐలోని ప్లగ్ అండ్ పే విధానంలో వాటిని పరిశీలించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ఎంఎస్ఎంఈలకు రుణాల్ని అందిస్తాయి. తద్వారా లోన్ కోసం పట్టే సమయం మరింత తగ్గనుంది.

- Advertisement -

సత్ఫలితాలిచ్చిన యూఎల్ఐ

గతేడాది ఆర్‌బీఐ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ ప్లాట్‌ఫారమ్‌ పేరుతో యూఎల్ఐ పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. పలు రాష్ట్రాల్లో యూఎల్ఐ పైలెట్ ప్రాజెక్ట్ కింద రుణాలు ఇచ్చే సమయం మరింత తగ్గింది. దీంతో యూఎల్ఐ సేవల్ని తర్వలోనే ప్రారంభిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles