Wednesday, October 16, 2024
HomeBusinessవిద్యార్థులకు ఆర్బీఐ శుభవార్త.. రూ.10 లక్షల ప్రైజ్ మనీ మీకోసమే!

విద్యార్థులకు ఆర్బీఐ శుభవార్త.. రూ.10 లక్షల ప్రైజ్ మనీ మీకోసమే!

RBI Launches Nationwide Quiz: విద్యార్థులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. ఆర్బీఐ దేశంలో తన సేవల్ని ప్రారంభించి 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్విజ్ పోటీని నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ క్విజ్ పోటీల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు ప్రైజ్ మనీని అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ క్విజ్ పోటీలకు డిగ్రీలోపు విద్యార్థులు మాత్రమే అర్హులు.

ఆర్బీఐ నిర్వహించే క్విజ్ లో కేవలం జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఆన్‌లైన్ లో ప్రారంభమయ్యే పోటీలు ముందుగా రాష్ట్ర, జోనల్ స్థాయి రౌండ్‌ల తర్వాత జాతీయ స్థాయిలో ముగస్తుంది. ఇక ఈ క్విజ్ పోటీల రిజిష్ట్రేషన్ RBI90Quiz.in పోర్టల్ లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 20, 2024న నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 17తో ముగియనుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన కొద్ది రోజులకే ఈ క్విజ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆర్బీఐ నిర్వహించే ఈ క్విజ్ పోటీల్లో పెద్ద మొత్తంలో నగదు అందిస్తుండగా.. ఆ నగదు వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.10 లక్షల వరకు ప్రైజ్ మనీ

ఆర్బీఐ నిర్వహించే ఈ క్విజ్ లో మొదటి బహుమతి రూ.10 లక్షలు, రెండవ బహుమతి రూ. 8 లక్షలు, మూడవ బహుమతి రూ. 6 లక్షలు. జోనల్స్‌లో మొదటి బహుమతి రూ. 5 లక్షలు, రెండవ బహుమతి రూ. 4 లక్షలు, మూడవ బహుమతి రూ. 3 లక్షలు. రాష్ట్ర స్థాయి క్విజ్‌లో మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండవ బహుమతి రూ. 1.5 లక్షలు, మూడవ బహుమతి రూ.1 లక్ష.

క్విజ్‌లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హతలు

RBI90Quiz సెప్టెంబరు 1, 2024న 25 ఏళ్లు మించని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు (అంటే, సెప్టెంబర్ 01, 1999న లేదా ఆ తర్వాత జన్మించిన వారు) . దేశానికి చెందిన కాలేజీల్లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించే విద్యార్థులు మాత్రమే అర్హులు.

- Advertisement -

ఏదైనా రిజిస్ట్రేషన్ ఫీజు ఉందా?

లేదు, క్విజ్‌లో పాల్గొనడం ఉచితం

ఆన్‌లైన్ క్విజ్‌కి సంబంధించిన కీలక తేదీలు ఏమిటి?

రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 20న ప్రారంభమైంది. సెప్టెంబర్ 17న ముగుస్తుంది. క్విజ్ తేదీ ఇంకా ప్రకటించబడలేదు.

ఆన్‌లైన్ క్విజ్ ఫార్మాట్ ఏమిటి?

క్విజ్‌లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, లిటరేచర్, స్పోర్ట్స్, ఎకానమీ, ఫైనాన్స్ వంటి సాధారణ ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు ఆర్బీఐకి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles