Washing Machine Buying Guide Tips in Telugu: రాబోతున్న ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్ డీల్స్‌లో మీరు వాషింగ్ మెషీన్ కొనాలని చూస్తున్నారా?. అయితే, మీరు వాషింగ్ మెషీన్ కొనేముందు ఇప్పుడు మనం చెప్పుకొనబోయే విషయాలను మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ప్రస్తుతం Samsung, Whirlpool, Haier, Bosch, LG, Godrej, Electrolux, Panasonic, IFB వంటి వాషింగ్ మెషీన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
వాషింగ్ మెషీన్‌లు ఎన్ని రకాలు..?
ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల వాషింగ్ మెషీన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి
- ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్
- టాప్ లోడ్ వాషింగ్ మెషీన్
ఫ్రంట్-లోడ్ సెమీ-ఆటోమేటిక్
ఈ రకమైన వాషింగ్ మెషీన్‌లు కొన్ని ప్రాథమిక పనులను సొంతంగా చేయగలవు, మిగత పనులను మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఉదా: వాటర్ ట్యాంక్‌ని నింపడం, ఉతికిన వస్త్రాలను డ్రైయింగ్ టబ్‌లోకి మార్చడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర నీరు గనుక తక్కువగా అందుబాటులో ఉంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లు మీకు అనువైనవి.
టాప్ లోడ్ సెమీ-ఆటోమేటిక్
ఈ రకమైన వాషింగ్ మెషీన్‌లు ఎల్లప్పుడూ తక్కువ విద్యుత్తును వినయోగిస్తాయి. ఇది రెండు డ్రమ్ములతో వస్తుంది, ఒకటి కడగడానికి మరియు మరొకటి ఎండబెట్టడానికి. వాషింగ్ పూర్తయిన తర్వాత, మీరు టబ్‌ను నీటితో నింపాల్సి ఉంటుంది. ఎండబెట్టడం కోసం వస్త్రాలను ఒక టబ్ నుండి మరొక టబ్‌కు మనం మార్చాల్సి ఉంటుంది.
ఫ్రంట్-లోడ్ పూర్తిగా ఆటోమేటిక్
ఫ్రంట్-లోడ్ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అనేవి బట్టలను ఉతికేటప్పుడు తక్కువ నీరు, విద్యుత్తును ఉపయోగిస్తాయి.
టాప్ లోడ్ ఫుల్ ఆటోమేటిక్
టాప్ లోడ్ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లు సాధారణంగా తక్కువ స్థలాన్ని తీసుకుంటాయి, కాబట్టి, మీకు తక్కువ స్థలం గనుక ఉంటే ఇలాంటి వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయడం మంచిది.
అలాగే 6kg, 6.5kg, 7kg, 8kg వంటి కెపాసిటీలతో వాషింగ్ మెషీన్లు మార్కెట్‌లోకి అందుబాటులో ఉన్నాయి. ‘వాషింగ్ మెషీన్ కెపాసిటీ 6కిలోలు’ అని ఉంటే.. దాని సామర్థ్యం 6 కిలోలుగా గుర్తించాలి. అంటే వాషింగ్ మెషీన్లో ఉతకగలిగే పొడి బట్టల లోడ్ సామర్ధ్యం 6 కిలోలు అని గుర్తించాలి.
(ఇది కూడా చదవండి: Laptop Buying Guide: ల్యాప్‌టాప్ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!)
అలాగే, ఒకసారి వేసే దుస్తులు వాషింగ్ మెషీన్‌లో 70-80% వరకు మాత్రమే నింపాలి. తద్వారా డ్రమ్ దాని పనిని సులభంగా చేయగలదని గుర్తుంచుకోవాలి. అంతకు మించి దుస్తులు వేయడం వల్ల ఓవర్‌లోడింగ్ అంటారు. అలాగే ఉతికే సమయంలో మెషీన్‌పై లోడ్ అధికంగా పడి సరిగ్గా పనిచేయదు.