Laptop/System Buying Guide in Telugu: ల్యాప్‌టాప్‌ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

0
40
Best Laptop Buying Guide in Telugu
Laptop / System Buying Guide in Telugu

Best Laptop Buying Guide Tips in Telugu: కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో ల్యాప్‌టాప్‌ వినియోగం చాలా పెరిగింది. చాలా మంది ఉద్యోగులు ఇంటి పనిచేయడంతో పాటు ఒక్కసారిగా డిజిటల్ వినియోగం భారీగా పెరగడటంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ల్యాప్‌టాప్‌ డిమాండ్ పెరిగింది

(ఇది కూడా చదవండి: Mobile Buying Guide Tips in Telugu: మొబైల్ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!)

ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఆర్థిక పరిస్థితులు ఎలా వున్నా ల్యాప్‌టాప్‌ కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, చాలా మందికి మొబైల్ మీద ఉన్నంత అవగాహన ల్యాప్‌టాప్‌ మీద లేకపోవడంతో వాటిని కొన్న తర్వాత బాధపడుతున్నారు. ఇప్పుడు మనం ల్యాప్‌టాప్‌ కొనేముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి.. మనకు కావాల్సిన ల్యాప్‌టాప్‌ని ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.

మీ అవసరాలను గుర్తించండి:

ముందుగా మనకు ఎలాంటి ల్యాప్‌టాప్‌/డెస్క్ టాప్ అవసరమో(అంటే హై-ఎండ్, మిడ్ లెవల్, బడ్జెట్ లెవల్ కంప్యూటర్ కావాలో) తెలుసుకోవాలి.

తక్కువ వినియోగం:

మీరు ప్రతి రోజు కంప్యూటరునీ వెబ్ సర్ఫింగ్, ఆన్లైన్ బిల్లులు చెల్లించడం, ఇమెయిల్ మరియు సినిమాలు లేదా స్ట్రీమ్ కంటెంట్ను, సోషల్ మీడియా వంటి వాటికోసం వాడుతుంటే తక్కువ కాన్ఫిగరేషన్ మరియు బడ్జెట్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయడం మంచింది.

మధ్యస్థ వినియోగం:

మీరు మీ పనిలో భాగంగా ఎక్కువగా టైప్ చేయడంతో పాటు ఫోటోలు ఎడిట్, బ్రౌజ్ చేయడం, ప్రోగ్రామింగ్ చేస్తుంటే మీకు కొంచెం శక్తివంతమైన ల్యాప్ టాప్ కొనుగోలు చేయడం మంచింది. ఈ కోవకు చెందిన వారు మిడ్ లెవల్ కాన్ఫిగరేషన్ గల కంప్యూటర్ కొనుగోలు చేయడం మంచింది.

భారీ వినియోగం:

మీరు కంటెంట్ క్రియేటర్ లేదా ఔత్సాహిక గేమర్, హై లెవల్ వీడియో & ఫోటో ఎడిటర్, AI ప్రోగ్రామ్ డెవలపర్ అయితే హై ఎండ్ కాన్ఫిగరేషన్ మరియు ప్రీమియం ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పనితీరు(Performance):

ఒక కంప్యూటర్ పనితీరు అనేది అందులో ఉండే Processor, RAM, Internal Stoarge, Battery, Graphic Card మీద ఆధారపడి ఉంటుంది.

ప్రాసెసర్(Processor):

ఒక మనిషికి మెదడు ఎంత ముఖ్యమో అదే విధంగా కంప్యూటరుకి కూడా ప్రాసెసర్ చాలా ముఖ్యం. ఒక కంప్యూటర్ వేగ వంతంగా, శక్తి వంతంగా పనిచేయాలంటే అంతే స్థాయిలో శక్తివంతమైన ప్రాసెసర్. ప్రాసెసర్’ను ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రధానంగా 2 ఉన్నాయి. అవి

Intel Processor: Intel Processorలో Core i9 సిరీస్ ప్రాసెసర్ అన్నింటికంటే శక్తి వంతమైనది మనం తెలుసుకోవాలి. క్రింద పేర్కొన్న టేబుల్ ప్రకారం మీ ఎలాంటి ప్రాసెసర్ అవసరమో మీరు తెలుసుకోవాలి.

AMD Processor: AMD Processorలో Ryzen 9 సిరీస్ ప్రాసెసర్ అన్నింటికంటే శక్తి వంతమైనది మనం తెలుసుకోవాలి. క్రింద పేర్కొన్న టేబుల్ ప్రకారం మీ ఎలాంటి ప్రాసెసర్ అవసరమో మీరు తెలుసుకోవాలి.

ర్యామ్(RAM- Random Access Memory):

ఒకే సమయంలో అనేక పనులను చేసేందుకు ఎక్కువ సామర్ధ్యం గల SSD(Solid State Drive) DDR5 ర్యామ్ తీసుకోవడం మంచిది. (ఊదా: 8 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్, 32 జీబీ ర్యామ్)

ఇంటర్నల్ స్టోరేజ్(Internal Stoarge):

ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ గల కంప్యూటరు తీసుకుంటే మనకు అన్నీ ఎక్కువ ఫైల్స్ సేవ్ చేసుకోవడంతో పాటు మీ ల్యాప్‌టాప్‌ అంతే వేగంగా పనిచేస్తుంది. (ఊదా: 500 జీబీ, 1024 జీబీ, 1TB)

బ్యాటరీ(Battery):

మీ ల్యాప్‌టాప్‌ ఎక్కువ సేపు రావాలంటే.. ఎక్కువ బ్యాటరీ సామర్ధ్యం గల కంప్యూటరు తీసుకోవడం మంచిది.

గ్రాఫిక్ కార్డ్(Graphic Card):

మీరు సినీమాలు చూసేటప్పుడు, వీడియో ఎడిట్ చేసేటప్పుడు, గేమింగ్ అడుకునేటప్పుడు మీ విజవల్స్ మంచిగా కనబడలంటే.. మీ ల్యాప్‌టాప్‌లో ఎక్కువ సామర్ధ్యం గల గ్రాఫిక్ కార్డ్ ఉండాలి.

డిస్ప్లే(Display):

మీరు సినీమాలు చూసేటప్పుడు, వీడియో ఎడిట్ చేసేటప్పుడు, గేమింగ్ అడుకునేటప్పుడు మీకు మంచి అనుభూతి అందించాలంటే.. 4K, Ultra HD 120 FPS రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్ ఉన్న కంప్యూటరు తీసుకోవడం మంచిది.

అలాగే మీరు ఒక ల్యాప్‌టాప్‌ కొనేటప్పుడు అందులో ఉండే పోర్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డిజైన్ కూడా చాలా ముఖ్యం అని మనం గుర్తుంచుకోవాలి.

మరిన్ని టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఈ క్రింది ఉన్న లింక్స్ ఫాలో అవ్వండి:

టెక్ పాఠశాల వాట్సాప్ చానెల్: https://whatsapp.com/channel/0029VaAjDNLCcW4hxsv3pk1N
టెక్ పాఠశాల ఫేస్బుక్ పేజీ: https://www.facebook.com/TechPatashala/
టెక్ పాఠశాల ట్విట్టర్ పేజీ: https://twitter.com/TechPatashala
టెక్ పాఠశాల టెలిగ్రాం గ్రూప్: https://t.me/techpatashala

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here