What is Mutual Fund in Telugu: మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్ మీద పూర్తిగా అవగాహన లేని, ఇతర పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును ఫైనాన్స్ నిపుణులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాలను పెట్టుబదుదారులకు లేదా ఇన్వెస్టర్లకు పంచడమే మ్యూచువల్ ఫండ్స్ అంటారు.
ఇంకా సులభంగా చెప్పాలంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాలను పంచడమే మ్యూచువల్ ఫండ్స్. ఏ స్కీముల్లో పెట్టుబడి పెట్టాలనేది మాత్రం ఇన్వెస్టర్ల ఇష్టం మీద ఆధారపడి వుంటుంది.
నేరుగా స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలుసు. అదే ఈ ఫండ్స్ లలో పెట్టుబడి పెడితే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే, వచ్చే లాభం తక్కువ అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.
(ఇది కూడా చదవండి: పాన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఇక ఆ కార్డులు చెల్లవు?)
మ్యూచువల్ ఫండ్ కంపెనీలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నియంత్రిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. పెట్టుబడిదారుల డబ్బును సురక్షితంగా ఉంచేందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీల కోసం సెబీ చాలా నియమ నిబంధనలను రూపొందించింది.
మ్యూచువల్ ఫండ్స్‌కి ఉదాహారణ:
మ్యూచువల్ ఫండ్స్ గురించి సులభంగా అర్ధం అయ్యేందుకు మీకు ఒక ఉదాహరణ వివరిస్తాను. మార్కెట్లో ఒక ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది అనుకుందాం. ఈ పథకం క్రింద మరో మిడ్ క్యాప్ స్కీమ్ ఉంది.
మీరు ఇన్వెస్ట్ చేసే స్కీమ్ గనుక ఈక్విటీ స్కీమ్ ఐతే షేర్లలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అదే రుణ స్కీమ్ ఐతే ఇన్వెస్టర్ల డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్లలలో మదుపు చేస్తారు. ఈ కంపెనీ మొదట్లో ఒక యూనిట్‌ను రూ. 10కి ఇచ్చిందని అనుకుందాం. ఒక్కో యూనిట్‌కు రూ.10 చెల్లించి 1000 యూనిట్లు కొనుగోలు చేస్తే మీరు రూ.10,000 చెల్లించాలి.
(ఇది కూడా చదవండి: హోమ్ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి?)
అయితే, ఒక సంవత్సరం తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మిడ్ క్యాప్ ఒక యూనిట్ ఫండ్ విలువ రూ. 20కు చేరింది అనుకుందాం. ఈ సమయంలో మీరు మీ యూనిట్స్‌ను తిరిగి ఆ మ్యూచవల్ ఫండ్స్ కంపెనీకి అమ్మినట్లైతే, మీరు కొనుగోలు చేసిన 1000 యూనిట్లకు గాను మీరు రూ. 20,000(రూ.10000 పెట్టుబడి +రూ. 10,000 లాభం) పొందుతారు. అంటే ఇక్కడ మీరు రూ.10,000 లాభం పొందుతారు.
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చార్జ్ చేస్తాయా?
అయితే, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ తరుపున మీ డబ్బును ఇతర పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టి మీకు లాభాలను పంచినందుకు గాను కంపెనీలు కొంత మొత్తాన్ని(1 to 2 శాతం వరకు) చార్జ్ చేస్తాయి. అది ఎంత అనేది కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫండ్స్’లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఛార్జీలు ఎంత అనేది ముందుగా తెలుసుకోవాలి.
మ్యూచువల్ పంఢ్ వల్ల కలిగే లాభాలు:
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎంచుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎంచుకుంటారు. ఇలా ఎన్నో లాభాలు మ్యూచువల్ ఫండ్స్‌లో వుంటాయి.
Types of Mutual Fund in Telugu: మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు?
1. ఈక్విటీ ఫండ్స్
ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్‌లో లేదా ఈక్వీటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను ఇన్వెస్టర్ల నుంచి డబ్బుని సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఫండ్స్ వల్ల పెట్టుబడిదారులు ఎక్కువ లాభాలను కూడా పొందుతారు. ఏ పెట్టుబడిదారులు అయితే ఎక్కువ రిస్క్ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్ ఈ ఈక్విటీ ఫండ్స్.
2. డెట్ ఫండ్స్
డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే అనేవి రావు. ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్ డెట్, బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీమ్‌లలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అంటారు.
ఏ పెట్టుబడిదారులు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఫిక్స్‌డ్ ఇన్కమ్ ఇన్‌స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు డెట్ ఫండ్స్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే వీటిలో లాభాలు ఎక్కువగా ఉండవు. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ, తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడికి డెట్ ఫండ్స్ మంచి ఆప్షన్.
3. హైబ్రిడ్ ఫండ్స్
కొన్ని కంపెనీలు మీరు పెట్టుబడి మెట్టిన నాగదులో కొంత మొత్తాన్ని ఈక్విటీ షేర్లలో, మిగతా మొత్తాన్ని డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి పథకాలను హైబ్రిడ్ ఫండ్స్ అని అంటారు.
4. మనీ మార్కెట్ ఫండ్స్
మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌కు మరోక పేరే లిక్విడ్ ఫండ్స్. డిపాజిట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్ అంటారు. ఈ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబుడులు పెడతారు.
5 గిల్ట్ ఫండ్స్
గిల్ట్ ఫండ్స్ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే ఫండ్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఎక్కువ మొత్తంలో కంపెనీలు డబ్బుని మదుపు చేస్తాయి. ఈ డబ్బుని బ్యాంకింగ్ రంగంలో మదుపు చేయడం వల్ల మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇంకా ఏమైనా సహాయం కావాలంటే కింద మీ పేరు, మొబైల్ నెంబర్ కామెంట్ చేయండి.