Ration Card Download in Telangana: రేషన్ కార్డు ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్డు అనేది కుటుంబ గుర్తింపుగా పనిచేసే ప్రభుత్వ పత్రమే గాక పేదప్రజలకు తక్కువ ధరలకే రేషన్‌ను అందించడంలో సహాయపడుతుంది.
(ఇది కూడా చదవండి: Ration Card: కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?)
ఒకవేళ మీరు ఇలాంటి ముఖ్యమైన ఫుడ్ సెక్యూరిటీ కార్డును ఎక్కడైనా పోగుట్టుకున్నట్లయితే బాధపడనవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఫుడ్ సెక్యూరిటీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణలో రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?
- మొదట తెలంగాణ ప్రభుత్వ ఫుడ్ సెక్యూరిటీ కార్డు పోర్టల్ ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత Ration Card Search మీద క్లిక్ చేసి FSC Search మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ నమోదు చేసి Search మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు సంబంధించిన అన్నీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.