Friday, November 8, 2024
HomeHow ToMusi River Buffer Zone: మీ ఇల్లు మూసీ నది బఫర్ జోన్‌లో ఉందో లేదో...

Musi River Buffer Zone: మీ ఇల్లు మూసీ నది బఫర్ జోన్‌లో ఉందో లేదో తెలుసుకోండి ఇలా..?

Check Musi River FTL, Buffer Zone MAP: ఇప్పుడు మన రాష్ట్ర‌మంతా అంద‌రి నోట ఒకటే మాట‌.. మూసీ న‌ది( Musi River ) ప్ర‌క్షాళ‌న‌పైనే. కానీ, ఆ నది పక్కన నివాసం ఉంటున్న వారిలో మాత్రం భయం నెలకొంది. వారు పుస్తెలు అమ్ముకుని, ల‌క్ష‌ల రూపాయాలు అప్పులు జేసి సొంతిల్లు నిర్మించుకుంటే.. నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు కూల‌గొడుతారా..? అని ఆర్త‌నాదాలు చేస్తున్నారు.

నాడు మ‌రి ప‌ర్మిష‌న్లు ఎందుకు ఇచ్చారంటూ నది పక్కన ఉంటున్న స్థానికులు నిల‌దీస్తున్నారు. మేం అయితే ఇండ్ల‌ను ఖాళీ చేసే ప్ర‌స‌క్తే లేదు.. అవ‌స‌ర‌మైతే ఉరి వేసుకుంటాం కానీ ఇక్క‌డ్నుంచి క‌దిలేది అని నిన‌దిస్తున్నారు. అయితే మూసీ న‌ది( Musi River) ప్ర‌క్షాళ‌న‌కు సంబంధించి మూసీ నది బఫర్ జోన్‌ అలైన్‌మెంట్ మ్యాప్(Musi Alignment Map) పేరుతో ఓ గూగుల్ మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందులో రెడ్( Red Mark), బ్లూ( blue Mark ) రంగుల‌తో రెండు గీత‌ల‌ను మూసీ న‌దికి ఇరువైపులా చూపించారు.

ఈ రెడ్ మార్క్ రివ‌ర్ బెడ్‌(River Bed )ను సూచిస్తోంది. అంటే న‌ది ప్ర‌వాహం ప్ర‌స్తుతం ఆ మేర ఉన్న‌ద‌ని ప్ర‌భుత్వం చెబుతుంది. ఇక బ్లూ మార్క్(Blue Mark ).. మూసీకి వ‌ర‌ద పోటెత్తిన‌ప్పుడు అక్క‌డి వ‌ర‌కు వ‌ర‌ద ప్ర‌వాహం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలుపుతోంది. ఈ బ్లూ మార్క్‌ను ఎఫ్ఆర్ఎల్‌(FRL )గా ప‌రిగ‌ణిస్తున్నారు. అంటే ఫుల్ రివ‌ర్ లెవ‌ల్(Full River Level ). ఇక రెడ్ మార్క్, బ్లూ మార్క్ మ‌ధ్య ఉన్న ఇండ్ల‌న్నీ మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌లో మునిగిపోనున్నాయి.

ఈ ఇండ్ల‌కు అధికారులు సర్వే చేప‌ట్టి రెడ్ మార్క్ వేస్తున్నారు. అయితే ఆ బ్లూ మార్క్ లైన్ త‌ర్వాత కొంత మేర ప్రాంతాన్ని బ‌ఫ‌ర్ జోన్‌గా ప‌రిగ‌ణించే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది. ఇదే గ‌నుక జ‌రిగితే కొన్ని ల‌క్ష‌ల కుటుంబాలు రోడ్డున ప‌డుతాయి. కాబ‌ట్టి మీ ఇల్లు మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌లో మునిగిపోతుందా..? లేదా అనే విష‌యాల‌ను ఈ కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోవ‌చ్చు. గోల్కొండ( Golconda ) నుంచి నాగోల్(Nagole) వ‌ర‌కు మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అందులో చూపించారు. ఏయే ప్రాంతంలో ఏ మేర‌కు ఇండ్లు పోతున్నాయో కూడా ఆ మ్యాపులో వివ‌రించారు.

మీ ఇల్లు మూసీ నది బఫర్ జోన్‌లో ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చూడండి:

మూసీ నది FTL, Buffer Zone Limit తెలుసుకోవడానికి ఈ కింద లింకు క్లిక్ చేయండి.

https://drive.google.com/file/d/1arCdxTEy0_Y9MOYSDmihEyxLlpCgo2ot/view?usp=drive_link

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles