Sunday, November 24, 2024
HomeGovernment8 New Options in Dharani Portal: ధరణిలో కొత్త మాడ్యూల్.. మరో 8 ఆప్షన్లు...

8 New Options in Dharani Portal: ధరణిలో కొత్త మాడ్యూల్.. మరో 8 ఆప్షన్లు అందుబాటులోకి!

8 New Options in Dharani Portal: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్​లో ప్రత్యేక మాడ్యూల్ తీసుకొని వచ్చింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట(Application for Passbook Data Correction) కొత్త మాడ్యూల్​ను తీసుకొచ్చింది. ఈ మాడ్యూల్ కింద 8 రకాల ఆప్షన్లు తీసుకొచ్చింది. కొత్తగా రాష్ట్ర తీసుకొచ్చిన ఆప్షన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • Change of Name in Dharani, | పేరు మార్పు
  • Change of Land Nature in Dharani | భూమి స్వభావం మార్పు
  • Change of Land Classification in Dharani | భూమి వర్గీకరణ మార్పు
  • Change of Manner in Which Land Acquired in Dharani | భూమి రకం మార్పు
  • Extent Correction in Dharani | విస్తీర్ణం సరిచేయడం
  • Missing Survey/Sub-Division No in Dharani | మిస్సింగ్ సర్వింగ్/ సబ్ డివిజన్ నెంబర్
  • Transfer Land From Notational Khata(all types) To Patta in Dharani | నోషనల్ ఖాతా(అన్నీ రకాలు) నుంచి పట్టాకు భూమిని బదిలీ
  • Change of Land Type in Dharani | భూమి అనుభవంలో మార్పు

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ధరణి పోర్టల్​లో ఈ వెసులుబాటు తీసుకొచ్చారు. దీంతో పాసు పుస్తకంలో తప్పిదాలను సవరించుకునే అవకాశం కలిగింది. మొత్తం 8 రకాల సవరణలకు ఆస్కారం ఏర్పడింది. చిన్నపాటి తప్పులు, పొరపాట్లు, ముద్రణా దోషాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సవరణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి భారీ సంఖ్యలో విజ్ఞప్తులు అందుతున్నాయి. తాజా మార్పుతో చాలా వరకు సమస్యలు తీరతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరికొన్ని మాడ్యూల్స్​ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

తెలంగాణ ప్రభుత్వం కొత్త మాడ్యూల్ కింద తీసుకొచ్చిన 8 రకాల ఆప్షన్లు పెట్టుకోవచ్చు. వీటి కోసం ధరణీ పోర్టల్ లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు సమయంలో పట్టాదార్ బయో-మెట్రిక్ తప్పని సరి. ఆ సమయంలో కచ్చితంగా సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ దరఖాస్తు జిల్లా కలెక్టర్ లాగిన్’లోకి వెళ్తుంది. జిల్లా కలెక్టర్ మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదం లేదా తిరస్కరిస్తారు.

(ఇది కూడా చదవండి: ఇక గ్రామాల్లో ఇల్లు కట్టాలంటే టీఎస్ బిపాస్ అనుమతి తప్పనిసరి!)

- Advertisement -

ధరణీ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మొదట ధరణీ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత Application for Passbook Data Correction అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎదుర్కొన్న సమస్యకు సంబంధించి ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు అందుకు తగిన ఆధారాలను, వివరాలను సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

Change of Name in Dharani( పేరు మార్పు): ఈ ఆప్షన్ కింద పట్టాదార్ పేరు తప్పుగా పడితే ఆ పేరును సరిచేసుకోవచ్చు.

Change of Land Nature in Dharani( భూమి స్వభావం మార్పు ): భూమి స్వభావం మార్పు అంటే మీ పట్టా భూమి ప్రభుత్వ భూమి లేదా అసైన్డ్ భూమి అని పడితే అప్పుడు ఈ ఆప్షన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

Change of Land Classification in Dharani( భూమి వర్గీకరణ మార్పు ): భూమి వర్గీకరణ మార్పు అంటే మీ మెట్ట/మాగాణి భూమి వర్గీకరణ అనేది తప్పుగా పడితే ఈ ఆప్షన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

Change of Manner in Which Land Acquired in Dharani( భూమి రకం మార్పు):

- Advertisement -

Extent Correction in Dharani( విస్తీర్ణం సరిచేయడం ): విస్తీర్ణం సరిచేయడం అంటే మీ భూమి అసలు విస్తీర్ణం కంటే తక్కువగా పడితే ఈ ఆప్షన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

Missing Survey/Sub-Division No in Dharani( మిస్సింగ్ సర్వింగ్/ సబ్ డివిజన్ నెంబర్) : మిస్సింగ్ సర్వింగ్/ సబ్ డివిజన్ నెంబర్ అంటే మీ భూమికి సంబంధించిన ఏదైనా ఒక సర్వే/సబ్ డివిజన్ నెంబర్ ధరణిలో కనిపించకపోతే ఈ ఆప్షన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

Transfer Land From Notational Khata(all types) To Patta in Dharani( నోషనల్ ఖాతా(అన్నీ రకాలు) నుంచి పట్టాకు భూమిని బదిలీ) : నోషనల్ ఖాతా అంటే ఏమిటి ఈ ఖాతా నెంబర్లను రెవెన్యూ అధికారులు తాత్కాలిక ప్రాతిపదిక ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ తరువాత కొందరు పట్టాదారు పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకోరు. అటువంటి సందర్భాల్లో అధికారులు తాత్కాలికంగా 100000, 100001 అంకెల్లో నోషనల్‌ నెంబర్లు ఇస్తారు.

భూముల వ్యవహారాలు కోర్టుల్లో ఉన్నపుడు కూడాఇలా నెంబర్లు ఇస్తారు. అప్పటికప్పుడు పని జరగడానికి వీటిని ఇస్తారు. శాశ్వత ఖాతా నెంబర్లు 1 నుంచి 4 అంకెల్లోపు మాత్రమే ఉంటాయి. నోషనల్‌ నెంబర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి లక్ష నుంచి మొదలవుతాయి. ఇప్పుడు వాటిని కూడా మార్చుకోవచ్చు.

Change of Land Type in Dharani( భూమి అనుభవంలో మార్పు ): మీ వ్యవసాయ భూమి సాంకేతిక కారణాలతో వ్యవసాయేతర భూమిగా పడితే అప్పుడు ఈ ఆప్షన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

ధరణిలో తప్పులు.. రైతులపై తప్పని భారం:

ధరణి పోర్టల్​లో కొత్త మాడ్యూల్​ కింద దరఖాస్తు పెట్టుకోవాలంటే ప్రభుత్వానికి రూ. 1,000 కట్టాల్సిందే. పట్టాదారు పాసుబుక్కులో చిన్న తప్పు వచ్చినా దాన్ని సరిదిద్దించుకోవాలంటే అంత మొత్తం చెల్లించాల్సిందే. మొన్నటి దాకా బాధితులు కరెక్షన్ల కోసం నాలుగైదు సార్లు ధరణి పోర్టల్​లో దరఖాస్తులు పెట్టుకోవడం, పెట్టుకున్న ప్రతిసారీ సర్వీస్​ చార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అయినా.. సమస్యలు పరిష్కారం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్​లో ప్రత్యేక మాడ్యూల్​ను తీసుకువచ్చింది.

(ఇది కూడా చదవండి: భూ పహాణీ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? భూ పహాణీ కోసం రుసుము ఎంత చెల్లించాలి?)

8 రకాల సవరణలకు ఇందులో అవకాశం కల్పించింది. అయితే.. వీటిలో ఏ ఒక్క దానికి అప్లయ్​చేసుకోవాలన్నా అప్లికేషన్​ ఫీజు కింద రూ. 1,000 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తున్నది. దీనికి సర్వీస్​ చార్జీ రూ. 11 అదనం. పైగా ఇంటర్నెట్​ చార్జ్​ కింద ఇంటర్నెట్​వాళ్లు మరో రూ.100 తీసుకుంటున్నారు. మొత్తంగా డబ్బులు కట్టిన తర్వాతనే పట్టాదారు పాసుపుస్తకంలోని తప్పుల సవరణలకు అవకాశం ఇస్తున్నారు.

సర్కార్ చేసిన సాంకేతిక తప్పులకు తమ నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో దేనికి దరఖాస్తు​ చేసుకున్నా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన మాడ్యూల్​లో 8 రకాల మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చని, వీటికింద దాదాపు 3.50 లక్షల నుంచి 4 లక్షల అప్లికేషన్లు రావొచ్చని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles