Monday, November 4, 2024
HomeGovernmentRation Card New Rules: రేషన్ కార్డు కొత్త రూల్స్.. ఇక అనర్హులు కార్డు తిరిగి...

Ration Card New Rules: రేషన్ కార్డు కొత్త రూల్స్.. ఇక అనర్హులు కార్డు తిరిగి ఇవ్వాల్సిందే?

Ration Card New Rules: 2 ఏళ్ల క్రితం క‌రోనా మ‌హ‌మ్మారి సమయంలో దారిద్య్ర‌రేఖ‌కు దిగువ‌న ఉన్న కుటుంబాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత రేష‌న్ కార్డులు స‌ర‌ఫ‌రా చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ సమయంలో ప‌లువురు అక్రమంగా రేష‌న్ కార్డులు పొంది ఉచిత రేష‌న్‌తో ల‌బ్ధి పొందార‌ని ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది. అలాగే, అర్హులైనా మరికొందరు రేష‌న్ కార్డు య‌జ‌మానులు బెనిఫిట్ పొంద‌లేద‌ని స‌మాచారం. అన‌ర్హులైన వారు రేష‌న్ కార్డుల‌ను త‌క్ష‌ణం తిరిగి ఇచ్చేయాలని ప్ర‌భుత్వం కోరింది. ఒక‌వేళ అన‌ర్హులైన కార్డుల య‌జ‌మానులు త‌మ రేష‌న్ కార్డుల‌ను స‌రెండ‌ర్ చేయ‌క‌పోతే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులనే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని పిలుస్తారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం.. ఈ కార్డులను జారీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రేష‌న్ కార్డు హోల్డర్లకు రేషన్ షాపుల (Ration Shops) ద్వారా నిరుపేదలకు సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా అందించాయి.

(ఇది కూడా చదవండి: ధరణిలో కొత్త మాడ్యూల్.. మరో 8 ఆప్షన్లు అందుబాటులోకి!)

అయితే రేషన్ కార్డ్ పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అర్హతలు లేకపోయినా రేషన్ కార్డు పొందినా, ఉపయోగించినా చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనర్హులు రేషన్ కార్డుల్ని ఉపయోగిస్తున్నట్టైతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. మరి రేష‌న్ కార్డు రూల్స్ ఏంటీ? ఏ సందర్భాల్లో రేషన్ కార్డ్ రద్దవుతుంది? తెలుసుకోండి.

ఎవ‌రెవ‌రు రేష‌న్ కార్డు స‌రెండ‌ర్ చేయాలంటే..

100 చ‌ద‌రపు మీట‌ర్ల కంటే ఎక్కువ నిడివి గ‌ల ఇల్లు లేదా ఫ్లాట్‌, కారు లేదా ట్రాక్ట‌ర్‌, గ్రామంలో రూ. 2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ వార్షికాదాయం, న‌గ‌రాల్లో రూ.3 ల‌క్ష‌ల కంటే ఎక్కువ వార్షికాదాయం గ‌ల వారు సంబంధిత త‌హ‌సీల్దార్‌కు గానీ, డీఎస్‌వో ఆఫీసులో గానీ రేష‌న్ కార్డును సమర్పించాలి.

ఎల్లో రేష‌న్‌కార్డుల‌కు అర్హ‌త

  • వార్షికాదాయం రూ.15 వేల వ‌ర‌కు గ‌ల కుటుంబాలు.
  • కుటుంబంలో డాక్ట‌ర్‌, న్యాయ‌వాది, ఆర్కిటెక్‌, చార్ట‌ర్డ్ అకౌంటెంట్ లేని వారు.
  • ప్రొఫెష‌న‌ల్ టాక్స్/ సేల్స్ టాక్స్/ ఇన్‌కం టాక్స్ చెల్లింపుదారులు లేని కుటుంబాలు
  • రెసిడెన్షియ‌ల్‌లో ఫోన్ ఫెసిలిటీ లేని కుటుంబాలు.
  • కారు లేని కుటుంబాలు
  • కుటుంబంలోని స‌భ్యులంద‌రికీ క‌లిపి రెండు హెక్టార్ల మెట్ట‌, హెక్టార్ మాగాణి, క‌రువు ప్రాంతాల్లో అర్ధ హెక్టార్ భూమి కూడా లేని వారు.

కాషాయ రేష‌న్ కార్డుల‌కు అర్హ‌త‌

  • రూ.15 వేల నుంచి రూ. ల‌క్ష లోపు వార్షిక ఆదాయం గ‌ల కుటుంబాలు
  • టాక్సీ మిన‌హా కార్లు లేని కుటుంబాలు
  • 4 హెక్టార్ల కంటే త‌క్కువ భూమి గ‌ల కుటుంబాలు
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles