ఆధార్ కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం చేత గుర్తింపబడిన అతి ముఖ్యమైన గుర్తింపు కార్డు. ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు ఆధార్ కార్డునే అడుగుతున్నారు. ప్రస్తుతం ఆధార్ వినియోగ ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా యూఐడీఏఐ ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవడానికి వినియోగదారులకు అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డును అప్ డేట్చేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ (SSUP), రెండోది ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ను సందర్శించడం ద్వారా. కొన్ని సేవలను ఇంట్లో నుంచే మార్చుకోవడానికి అవకాశం ఉంటే మరికొన్ని సేవలను ఆధార్ కేంద్రాల్లో మార్చుకోవచ్చు. (ఇది చదవండి: రూ.40వేల కోట్లు దానం చేస్తానంటున్న బిలియనీర్?)
ప్రతి ఒక్కరికీ ఆధార్ లో ఉన్న ఫోటో చాలా వరకు నచ్చదు. ఆధార్ ఫోటో మీద ఇంటర్నెట్లో చాలా జోకులు పేలుతుంటాయి. అందుకే చాలా మంది ఫోటో మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు అని అనుకుంటారు. మీకు గుడ్ న్యూస్.. ఆధార్ కార్డులో ఫోటో కూడా పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను మార్చినట్టే ఫోటోను కూడా మార్చేయొచ్చు. ప్రస్తుతం మీరు ఆధార్ కార్డులో ఫోటో మార్చాలని అనుకుంటే తప్పనిసరిగా ఆధార్ ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. (ఇది చదవండి: సెక్యూరిటీ ఆలర్ట్: ఈ యాప్ ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి?)
ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లిన తర్వాత దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి డీటెయిల్స్ రాయాలి. ఆ తర్వాత ఆధార్ కేంద్రంలోని ఎగ్జిక్యూటీవ్ మీ లేటెస్ట్ ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత మీ బయోమెట్రిక్స్ వివరాలతో అప్రూవ్ చేస్తారు. మీ ఫోటో అప్‌డేట్ చేయడానికి రూ.25+జీఎస్‌టీ చెల్లించాలి. మీ ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఒకవేళ పీవీసీ కార్డ్ కావాలంటే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఆర్డర్ చేయాలో ఈ క్రింది వీడియొ చూడండి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.