YSR Sunna Vaddi Scheme Details in Telugu: ఏపీ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ వైయస్ఆర్ సున్నా వడ్డీ(మహిళలు) పథకం వడ్డీ డబ్బులను రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతాలో ఈ నగదు జమ చేశారు. బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేద మహిళల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి కావాల్సిన అర్హతలు:
- దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించాలి.
- దరఖాస్తు చేసే వ్యక్తి తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
- దరఖాస్తుదారుడు దారిద్య్రరేఖకు దిగువన నివసించే వ్యక్తి కావాల్సి ఉంటుంది.
- దరఖాస్తు చేసే అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం సహాయక బృందంలో సభ్యురాలిగా ఉండాలి.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- ఓటరు ID కార్డ్
- ఆధార్ కార్డ్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
- స్వయం సహాయక బృందం సర్టిఫికేట్
- లోన్ పేపర్లు
- బ్యాంక్ ఖాతా వివరాలు
- చిరునామా రుజువు