Sunday, October 13, 2024
HomeAutomobileOla Electric Bike: త్వరలో మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. అదిరిపోయే రేంజ్!

Ola Electric Bike: త్వరలో మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. అదిరిపోయే రేంజ్!

Ola Electric Bike Price, Range in India: ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఆగస్టు 15న మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ట్విట్‌ చేశారు. ఈ ఫోటోలో త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ పాక్షికంగా కనిపిస్తుంది.

కంపెనీ త్వరలో తీసుకొని రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ KTM సిరీస్‌ మోటార్‌ సైకిళ్లను పోలి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఆగస్టు 15న లాంచ్ చేసి ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని సంస్థ యోచిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ రేంజ్(అంచనా):

అయితే, ఈ బైక్‌పై ఇప్పటికే అనేక రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ కంపెనీ త్వరలో ఆవిష్కరించనున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌ రేంజ్ అనేది 300 నుంచి 350 కిమీ మధ్య ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజువారీ వినియోగానికి ఈ బైక్‌ మంచి ఎంపిక కానున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర(అంచనా):

ఓలా నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర రూ.2.50 లక్షలకు పైగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ధర గురించి ఓలా సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన ఎక్కడ చేయలేదు. ఆగస్టు 15న ఈ బైక్ ధర, ఇతర వివరాలు విడుదల చేసే అవకాశం ఉంది.

(ఇది కూడా చదవండి: ఈవీ మార్కెట్లో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles