ఏపీ రైతులకు జగన్ ప్రభుత్వం శుభ వార్తా చెప్పింది. ప్రస్తుతం సాగులో ఉన్నా ఖరీఫ్ మొత్తం పంటలకు ఉచిత పంటల భీమాను అమలు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ – పంటలో నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే బీమాని పరిమితం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 101 కోట్లతో ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీఐసీఎల్) ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసింది.
కొన్ని నిబందనల వల్ల ప్రస్తుతం ఆ సంస్థ పెండింగ్ లో ఉంది. కానీ గత ఏడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యానవన పంటలకు బిమాను అమలు చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏయే జిల్లాలో ఏయే పంటలకు దిగుబడి, వాతావరణ భీమాని అమలు చేయాలో జాబితాని విడుదల చేసింది. జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే ఆధ్వర్యంలో నిర్వహించే నిర్దేశిత పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడి ఆధారిత పంటల బీమా క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తారు.(చదవండి: పబ్ జీ గేమ్ మళ్ళీ భారత్ లోకి వచ్చేస్తోందా?)
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.