ఏపీ ప్రభుత్వం దసరా పండుగకు ముందు రైతులకు మరో శుభవార్త తెలిపింది. ఇటీవల ‘వైఎస్సాఆర్ జలకళ’ అనే పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అర్హులైన రైతులందరికీ బోర్లు వేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఉచిత బోర్లతో పాటు పంపు సెట్లు, మోటర్లను కూడా ఉచితంగానే అందిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నాడు జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఉచితంగానే విద్యుత్ కనెక్షన్ ను కూడా అమర్చాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్ల లోతు, పంట వివరాల ఆధారంగా పంపుసెట్లు, మోటార్లను బిగించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కోసం కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు రైతులు గ్రూపుగా ఏర్పడి ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ ని సర్కార్ సిద్దం చేసింది.(చదవండి: మరింత భద్రంగా గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా)
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.