ప్రస్తుతం చాలా పనులకు మనకు పాన్ కార్డు అవసరం ఉంటుంది. అందుకే మీరు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు కోసం ధరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఫారం 49A లేదా 49AA నింపాల్సి ఉంటుంది. పాన్ కార్డు రిజిస్ట్రేషన్ కి ముందు ఫారం 49తో పాటు కొన్ని గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఎక్కువ శాతం ఆధార్ కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మన పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను కార్డులో మార్చాలని అనుకున్న మనకు కింద తెలిపిన పత్రాలు అవసరం.
ఇంకా చదవండి: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా!
గుర్తింపు దృవీకరణ కోసం(Proof Of Identity)
- ఆధార్ కార్డు
- పాస్ పోర్ట్
- ఓటర్ ఐడీ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- దరఖాస్తుదారుడి ఫోటో ఉన్న రేషన్ కార్డు
- ఆర్మ్ యొక్క లైసెన్స్ ఫోటో గుర్తింపు కార్డు
- కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడీ కార్డు
- ప్రభుత్వ రంగ సంస్థ పెన్షనర్ కార్డు/మాజీ సైనికుల సహాయక ఆరోగ్య పథకం ఫోటో కార్డు
చిరునామా గుర్తింపు కోసం(Proof Of Address)
- ఆధార్ కార్డ్
- ఓటర్ ఐడీ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- తాజా ఆస్తి పన్ను గురింపు పత్రం
- జీవిత భాగస్వామి యొక్క పాస్ పోర్ట్
- దరఖాస్తుదారుడి చిరునామా గల పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రం
- ప్రభుత్వం జారీ చేసిన డొమిసిల్ సర్టిఫికేట్(మూడు సంవత్సరాల కన్నా తక్కువ)
పుట్టిన తేదీ కోసం(Proof Of Date Of Birth)
- మునిసిపల్ అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం లేదా జనన మరణాల రిజిస్ట్రార్ లేదా భారతీయులచే పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 2లోని సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (డి)లో నిర్వచించిన ప్రకారం జనన మరియు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడానికి అధికారం ఉన్న ఏదైనా కార్యాలయం నుండి పొందిన గుర్తింపు పత్రం.
- పాస్ పోర్ట్
- పెన్షన్ చెల్లింపు ఆర్డర్
- మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్
- వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత
- ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం
- వివాహ రిజిస్ట్రార్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రం
- పుట్టిన తేదీని పేర్కొంటూ మేజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ లో ప్రమాణం చేసిన పత్రం
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని Subscribe చేసుకోండి.