మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉండాల్సిన పత్రాలలో ఆధార్ కార్డు అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది భారతదేశ పౌరులకు ఒక గుర్తింపు కార్డ్. ఇది సామాజిక పథకాలతో పాటు విద్య, ఉద్యోగ, బ్యాంక్ ఖాతా తెరవడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వంటి అనేక ఇతర విషయాలలో ఆధార్ ని ఉపయోగిస్తున్నాం. మీరు కొన్ని సార్లు ఆధార్ లో మార్పులు చేయాలంటే తప్పని సరిగా ఆధార్ సేవ కేంద్రం లేదా ఆధార్ నమోదుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ కరోనా సమయంలో అది అంత మంచిది కాదు.
ఇంకా చదవండి: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా!
అందుకే పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో కొత్త అప్డేట్ తో ముందుకు వచ్చింది. ఈ కొత్త అప్డేట్ లో భాగంగా ఆధార్ కార్డుదారులు వారి ఇంట్లో నుండే మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగాన్ని నవీకరించవచ్చు. కానీ మిగతా సేవల కోసం మాత్రం ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలని యుఐడీఎఐ పేర్కొంది.
ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండి ఇలా..
- మొదట ఆధార్ యొక్క అధికారిక వెబ్ సైట్ https://uidai.gov.in/ ను వెళ్ళండి.
- మై ఆధార్ లోని ‘అప్‌డేట్ ఆధార్ ఆప్షన్’పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు కనిపించే ‘అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్లైన్‘పై క్లిక్ చేయండి
- తర్వాత ప్రొసీడ్ అప్‌డేట్ ఆధార్‘పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఆధార్ కార్డు నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
- ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు మీకు కనిపించే ‘అప్‌డేట్’ డామోగ్రాఫిక్ డేటాను ఎంచుకోండి.
- మీకు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం వంటి అనేక ఎంపికలు కనిపిస్తాయి
- మీరు అప్‌డేట్ చేయాలని అనుకున్నా దాన్ని ఎంచుకొని వివరాలను మార్చుకోండి.
- అన్ని వివరాలను నింపిన తరువాత ఐడిని అడ్రస్ ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయాలి. దీన్ని ఏ ఫార్మాట్‌లోనైనా పీడీఎఫ్, జెపిఇజీ లేదా పీఎన్‌జీలో అప్‌లోడ్ చేయవచ్చు.
- డెబిట్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ లో 50 రూపాయలు 50 రూపాయల రుసుమును చెల్లించండి.
- చెల్లింపు విజయవంతం అయిన వెంటనే నిర్ధారణ కోసం మొబైల్ నంబర్‌కు URN కోడ్ పంపబడుతుంది.
- మీరు ఈ కోడ్ ద్వారా అప్‌డేట్ చేసుకున్న వివరాలను ట్రాక్ చేయగలరు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని Subscribe చేసుకోండి.