Gift Deed Document: ఒక వ్యక్తి ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన/బహుమతిగా పొందిన తర్వాత అతను ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అయితే, చాలా మంది ఇక్కటితో వారి పూర్తి అయిన అందరూ భావిస్తారు. కానీ, చాలా మందికి తెలియని రెవెన్యూ రికార్డులలో తమ పేరును గత యజమాని స్థానంలో మార్చుకోరు.
దీనివల్ల కొంత మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక ఆస్తిపై మనం నిజమైన వారసులు అనే తెలియజేయడానికి ల్యాండ్ మ్యుటేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనది.
మ్యుటేషన్ అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట ఆస్తి ఎవరు పేరు మీద ఉందో రెవెన్యూ రికార్డు తెలియజేస్తుంది. అయితే, ఈ రెవెన్యూ రికార్డులో మీరు కొనుగోలు చేసిన భూమి మీ పేరు మీద మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియను మ్యుటేషన్ ప్రక్రియ అంటారు. అందుకే, ఎవరైనా ఒక భూమి/ఆస్తి కొనుగోలు చేస్తే వెంటనే మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
(చదవండి: మ్యుటేషన్ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?)
గిఫ్ట్ డీడ్ భూములకు మ్యుటేషన్ చేయాలా?
ఇక్కడ చాలా మంది గిఫ్ట్ డీడ్ భూములకు మ్యుటేషన్ చేయాలా వద్దా అనే సందేహం ఎక్కువ మందికి వస్తుంది. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక భూమిని కొనుగోలు చేసిన, గిఫ్ట్ రూపంలో భూమిని పొందిన, వారసత్వ రూపంలో పొందిన, వీలునామా రూపంలో పొందిన భూములకు కచ్చితంగా మ్యుటేషన్ చేయించుకోవాలి.
రెవెన్యూ రికార్డులలో మన పేరు మీద భూమి ఉన్నప్పుడు మాత్రమే ఆ భూమి మన సొంతం అవుతుంది. భూమిని ఏ రూపంలో పొందిన కచ్చితంగా మ్యుటేషన్ చేపించుకోవాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.