Saturday, October 12, 2024
HomeHow ToCaste Certificate: ఏపీ, తెలంగాణలో కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

Caste Certificate: ఏపీ, తెలంగాణలో కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

How To Apply For Caste Certificate Online Telugu: మన దేశంలో కేంద్ర, రాష్ట్రాలు అందిస్తున్న ప్రయోజనాలను పొందాలంటే కుల ధృవీకరణ పత్రం(Caste Certificate) తప్పనిసరి అనే విషయం మనకు తెలిసిందే. రైతుల విషయానికి వస్తే సబ్సిడీ, రాయితీ వంటి వాటి కోసం కుల ధృవీకరణ పత్రం అవసరం.

అలాగే, విద్యార్దుల విషయానికి వస్తే స్కాలర్ షిప్, కాలేజీలలో ప్రవేశం కోసం, ఉద్యోగాల కోసం ఈ కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. అయితే, ఒక్కో కులానికి సంబంధించి ఒక పత్రం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి కులాలకు ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. అలాగే, ఈ కులాలకు సంబంధించిన పత్రాలు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది.

(చదవండి: ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

ఎస్సీ, ఎస్టీ(SC, ST Caste Certificate) కులాలకు ఎటువంటి షరతులు లేవు. కానీ, బీసీ(OBC Caste Certificate), ఓసీ కులాలకు సంబధించిన పెద ప్రజలు ముందుగా క్రిమిలేయర్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. బీసీ కులాలకు చెందిన కుటుంబాల ఆదాయం ఏడాదికి రూ.6 లక్షలకు మించితే ఈ పత్రాన్ని పొందలేరు. అలాగే, ఓసీ కులాలకు చెందిన కుటుంబ ఆదాయం రూ.8 లక్షలతో పాటు ఇతర కొన్ని షరతులు వర్తిస్తాయి.

కుల ధృవీకరణ పత్రం(Caste Certificate) కోసం అవసరమైన పత్రాలు:

  1. దరఖాస్తు ఫారం
  2. కుటుంబ సభ్యులకు కుల ధృవీకరణ పత్రం
  3. SSC మార్క్స్ మెమో / DOB ఎక్స్‌ట్రాక్ట్ / ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్
  4. ఏదైనా రేషన్ కార్డు / ఓటరు ఐడి కార్డు / ఆధార్ కార్డు
  5. దానికి తోడు, దరఖాస్తుదారుడు క్రీమీలేయర్‌కు చెందినవాడా లేదా అని తనిఖీ చేయడానికి క్రింది పత్రాలు అవసరం.
  6. ఏదైనా దరఖాస్తుదారు తండ్రి & తల్లి ఆస్తి వివరాలు
  7. ఆదాయపు పన్ను రాబడి (నిపుణుల కోసం)

కుల ధృవీకరణ పత్రం(Caste Certificate) దరఖాస్తు విధానం:

  1. మొదట దరఖాస్తు ఫారంలో మీ వివరాలను నింపండి.
  2. ఇప్పుడు ఆ ఫారంతో పాటు పైన పేర్కొన్న జిరాక్స్ పత్రాలను జత చేయండి.
  3. తప్పనిసరిగా క్రీమీలేయర్‌ పత్రాన్ని జత చేయడం మరిచిపోవద్దు(బీసీ, ఓసీ కులాల వారు మాత్రమే)
  4. ఇప్పుడు మీ దగ్గరలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ధరఖాస్తు చేసుకోండి.
  5. కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాక మీ మొబైల్ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది.

కుల ధృవీకరణ పత్రం(Caste Certificate) కోసం మీసేవలో ధరఖాస్తు చేసుకున్నాక ఇప్పుడు మొదట వివరాలను మీ గ్రామ VRO అధికారి పరిశీలీస్తారు. మీరు పొందుపరిచిన వివరాలు నిజమైతే, మీ ఫైల్ మీద సంతకం చేసి Revenue Inspector తనికి కోసం పంపిస్తారు. ఈ అధికారి కూడా మీ వివరాలును పరిశీలించి మీరు ఇచ్చిన వివరాలు నిజమే అని భావిస్తే ఆ ఫైల్ మీద సంతకం చేసి డిప్యూటీ తహశీల్దార్ సంతకం కోసం పంపిస్తారు. ఈ అధికారి కూడా మీ చెక్ చేసి మండల్ రెవెన్యూ ఆఫీసర్ సంతకం కోసం పంపిస్తారు. అప్పుడు మండల్ రెవెన్యూ ఆఫీసర్ మీ ఫైల్ మీద సంతకం చేస్తే మీకు కుల దృవీకరణ పత్రం వస్తుంది.

కుల ధృవీకరణ పత్రం దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకునే విధానం:

  1. ఏపీ, తెలంగాణ మీసేవా పోర్టల్ సందర్శించండి
  2. మీ సర్టిఫికేట్ స్థితిని తనిఖీ చేయడానికి అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
  3. ఇప్పుడు GO మీద క్లిక్ చేయండి.

(ఇది కూడా చదవండి: ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles