Dharani Portal In Telangana: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకతను తీసుకొనిరావడం కోసం ధరణి పోర్టల్ (Dharani Portal)ను తీసుకొచ్చారు. ఈ ధరణి పోర్టల్ వల్ల అనేక సమస్యలు ఎదురుఅవుతూనే ఉన్నాయి. భూములకు సంబంధించిన రకరకాల సమస్యలపై ఇప్పటికే లక్షన్నరకు పైగా పిర్యాదులు వచ్చాయి.
నిషేదిత భూముల జాబితాలో పట్టా భూములు
పార్ట్ బీలో చేర్చడం వల్ల భూములకు పాస్ బుక్స్ రానోళ్లు, పాస్ బుక్ వచ్చినా ధరణిలో డిజిటల్ సైన్ కానోళ్లు, కొత్త పాస్ బుక్ వచ్చినా ధరణి పోర్టల్‌లో తమ సర్వే నంబర్, భూమి వివరాలు కనిపించనోళ్లు, అకారణంగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో భూమి చేరినోళ్లు, రిజిస్ట్రేషనైనా మ్యుటేషన్ కానోళ్లు ధరణితో పాటు ధరణి గ్రీవెన్స్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.
గ్రీవెన్స్ వాట్సాప్ నంబర్‌కు మూడ్రోజుల్లోనే 17 వేల కంప్లైంట్స్ వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ మెయిల్‌కు మరో 3 వేల విజ్ఞప్తులు వచ్చాయి. ఈ పిర్యాదులపై రెవెన్యూ సరైన సమాధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురిఅవుతున్నారు. ఇందులో ప్రధానంగా చాలా వరకు పట్టా భూములు నిషేదిత భూముల జాబితాలోకి వెళ్తున్నాయి.
ఇలాంటి సమస్యలు రాష్ట్రం మొత్తం 2 లక్షలకు పైచిలుకు సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎటువంటి కారణం లేకుండా భూములు నిషేదిత జాబితాలో ఎందుకు ఉన్నాయి అనేది ప్రజలకు ఆవేదన చెందుతున్నారు.
నిషేధిత భూముల జాబితా అంటే?
ప్రభుత్వ అధీనం లేదా ప్రభుత్వ భూములు లేదా అస్సైండ్ భూములు లేదా దేవాదాయ లేదా వక్ఫ్ భూములు, ప్రజలకు పంచిన భూములు గత కొంత కాలం నుంచి ఆక్రమనకు గురి అవుతున్నాయి. ఇటువంటి భూములను ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా రిజిష్ట్రేషన్లు చేయకుండా చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాబితాను రూపొందించారు.
ఆ జాబితానే నిషేదిత భూముల జాబితా అంటారు. ఈ జాబితాలో ఉన్న భూములను రిజిష్ట్రేషన్ చేయడం కుదరదు. ప్రభుత్వ భూములను ఈ విధంగా బదిలీ చేయడాన్ని రిజిష్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A నిషేధిస్తుంది. దీనికై జిల్లా కలెక్టర్ నిషేధిత భూముల జాబితాను సెక్షన్ 22A కింద గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించవచ్చు.
మీ భూమి నిషేదిత భూముల జాబితాలో ఎందుకు ఉంది అనేది తెలుసుకోండి
మీ పట్టా భూమి ఏ కారణం చేత నిషేదిత భూముల జాబితాలో ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలానో మనం ఈ క్రింద తెలుసుకుందాం.
మొదట మీరు తెలంగాణ రిజిష్ట్రేషన్ & స్టాంప్స్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీకు Browse ఆప్షన్ కింద కనిపిస్తున్న Prohibited Property ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు District, Mandal, Village, Select Criteria(Survey No) వివరాలు నమోదు చేయండి.
మీరు సర్వే నెంబర్ బై నెంబర్ ప్రధాన నెంబర్ మెయిన్ సర్వే నెంబర్(EX:36) ఎంచుకోండి.
ఇప్పుడు మీ భూమి ప్రభుత్వ భూమినా, అస్సైండ్ భూమినా, దేవాదాయ లేదా వక్ఫ్ భూమినా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా వంటి కారణాలు మీకు చూపిస్తుంది. మీ భూములు ఎటువంటి కారణం లేకుండా ఈ భూముల జాబితాలో చేరితే మీరు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయవచ్చు.