గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో గతంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, జూన్ 8 వరకు పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, చాలా మంది ప్రజలు తమ దరఖాస్తు స్టేటస్ ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారు.
తమ దరఖాస్తులను అధికారులు ఆమోదించారో, లేదో అనే సందేహంలో ఉన్నారు. అయితే మీ సేవకు వెళ్లి మీ దగ్గర ఉన్న మీ సేవ నెంబర్ సహాయంతో దరఖాస్తు అప్రూవ్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లోనే ఉండే మీ రేషన్ కార్డు ఆప్లికేషన్ స్టేషన్‌ను తెలసుకోవచ్చు.
ఇందుకోసం మీరు మొదట https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో కావాలి.
- https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత FSC Search అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు Ration Card Search కింద FSC Search, FSC Application Search అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
- కొత్త రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవడం కోసం FSC Application Search అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు Select District, Search By అనే రెండు బాక్స్‌లు కనిపిస్తాయి. సెలక్ట్ డిస్ట్రిక్ట్ లో మీ జిల్లాను ఎంచుకోవాలి. ఇక Search Byలో.. మీ సేవ నెంబర్ / మొబైల్ నెంబర్ / అప్లికేషన్ నెంబర్ లలో ఏదైనా ఒకటి ఎంచుకోని.. వివరాలు నమోదు చేయాలి.
- ఆ తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు దరఖాస్తును అధికారులు ఆమోదించారో లేదా అనేది మీకు తెలుస్తుంది.
Support Tech Patatshala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.