మీరు కొత్త ఇంటికి మారరా? ఆధార్ కార్డులో ఇంకా చిరునామాని చేంజ్ చేయలేదా? అయితే, మీరు ఏమి కంగారూ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సులభంగానే ఇంట్లో నుంచే 5 నిమిషాల్లో ఆధార్ కార్డులోని చిరునామాని మార్చవచ్చు. ఆధార్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డుదారులు పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వాటిని అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుదారులు పోర్టల్ ద్వారా చిరునామాను అప్ డేట్ చేసుకోవచ్చు అని ఆధార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. “మీరు ఇప్పుడు చిరునామాని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేసుకోవచ్చు” అని ట్వీట్ లో పేర్కొంది.
ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే ఆధార్ యూజర్ కచ్చితంగా ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరును కలిగి ఉండాలి. అలాగే, ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేసినందుకు రూ.50 చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చిరునామాను మార్పు చేయాలంటే యుఐడీఎఐ వెబ్ సైట్ లో పేర్కొన్న పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర డాక్యుమెంట్ ల కాపీని తప్పక అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్‌కార్డులో చిరునామాని మార్చండి ఇలా:
- ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ యుఐడీఎఐ పోర్టల్ ఓపెన్ చేయాలి.
- తర్వాత ఫ్రోసిడ్ టూ ఆప్‌డేట్ ఆధార్‌ను క్లిక్ చేయండి.
- ఆప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్‌ను క్లిక్ చేసిన తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి కాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
- తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- మొబైల్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- ఇప్పుడు డెమోగ్రాఫిక్ ఆప్షన్ ఎంచుకొని మీ కొత్త చిరునామా వివరాలు సమర్పించాలి.
- మీ ఒరిజినల్ కలర్ స్కానడ్ కాపీలను అప్ లోడ్ చేయండి.
- నమోదు చేసిన డేటా ఇంగ్లిష్, స్థానిక భాషలో కనిపిస్తుంది.
- ఇప్పుడు మీ ఆధార్ అప్ డేట్ స్టేటస్ ట్రాక్ చేయడం కొరకు మీరు మీ రిక్వెస్ట్ నెంబరు(ఆర్ఎన్ఆర్ఎన్)ని సేవ్ చేసుకోవాలి.
Support Tech Patashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.