తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లకు చివరి రోజైన బుధవారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి 76 నామినేషన్లు దాఖలు కాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి 48 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు సంబందించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది. అయితే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో మీరే స్వయంగా తెలుసుకోవచ్చు.
- మీ ఓటర్ ఐడి కోసం ఎన్నికల సంఘం వెబ్ సైట్ సందర్శించండి.
- గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీపై క్లిక్ చేస్తే ఒక ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది.
- ఈ పేజీలో MLC Search Your Nameదానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఎమ్మెల్సీ అప్లికేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సర్చ్ క్లిక్ చేయండి.
- మీకు మీ ఓటర్ ఐడి డౌన్లోడ్ అవుతుంది. దానిలో ఓటువేసే ప్రదేశం ఉంటుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.