Thursday, April 25, 2024
HomeGovernmentAndhra PradeshEncumbrance Certificate: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Encumbrance Certificate: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Download Encumbrance Certificate in AP Online : ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఏదైనా ఒక ఆస్తిని/భూమిని కొనుగోలు చేసినపుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తనికి చేయాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్.

ఒక వ్యవసాయ లేదా వ్యవసాయేతర భూమి కొన్నప్పుడు ఆ భూమి మీకు విక్రయిస్తున్న వ్యక్తి పేరు మీద ఉందో లేదో చెక్ చేసుకోవడానికి నిర్దారించే ఒక ప్రభుత్వ పత్రమే ఈ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌. అలాగే, ఆ భూమి మీద ఏదైనా బ్యాంక్ లోన్ లేదా ఏదైనా చట్టపరమైన వ్యాజ్య సమస్యలు వంటివి ఉంటే కూడా ఈ పత్రం తెలియజేస్తుంది.

ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ అంటే ఏమిటి?

ఇంకా సులభంగా చెప్పాలంటే 1983 నుంచి ప్రస్తుతం వరకు మీరు కొనుగోలు చేసిన లేదా చేయబోయే భూమి ఎంత మంది చేతులు మరిందో తెలియజేసే పత్రమే ఈ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌. ఈ పత్రం ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన ఓనర్ లేదా యాజమాని ఎవరు అనేది కూడా తెలియజేస్తుంది. ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈసీ అవసరం అవుతుంది.

IGRS AP EC: ఏపీలో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ ఎలా సర్చ్/డౌన్‌లోడ్ చేయాలి?

  • ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్ చేయడానికి మన దగ్గర డాక్యుమెంట్ నెంబర్, ఆ భూమి ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు జాబితా వంటి ఇతర ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వివరాలు కచ్చితంగా ఉండాలి.
  • ఇప్పుడు http://registration.ap.gov.in/chatbot-0.0.1-SNAPSHOT/ ఏపీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత SERVICES విభాగంలో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ అనే ఆప్షన్ ఉంటుంది.
  • ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత SUBMIT అనే ఆప్షన్ నొక్కండి.
  • ఇప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ నెంబర్, మేమో నెంబర్, ఇతర ప్లాట్ లేదా భూమి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

సర్వర్ బిజీగా లేదా మైగ్రేషన్ ఉన్న సమయాల్లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్ చేయడం అనేది కొద్దిగా అసాధ్యం అనే విషయాన్ని మనం గమనించాలి.

- Advertisement -

డాక్యుమెంట్ నెంబరుతో AP EC సర్చ్ చేసేటప్పుడు, దిగువ పేర్కొన్న వివరాలను నమోదు చేయండి.

  • డాక్యుమెంట్ నెంబరు
  • రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం
  • ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఈసీ డిపార్ట్ మెంట్ ఏ ఎస్ఆర్ఓ వద్ద రిజిస్టర్ చేశారు
  • క్యాప్చా
  • ఇప్పుడు సబ్మిట్ మీద ప్రెస్ చేయండి.

మెమో నెంబరుతో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్ చేసేటప్పుడు క్రింది వివరాలను నమోదు చేయండి.

  • మెమో నంబర్
  • రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం
  • ఏ SRO వద్ద రిజిస్టర్ చేయబడింది
  • క్యాప్చాను నమోదు చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి.

చివరగా, ఒకవేళ మీరు ‘ఏదీ కాదు’ ఆప్షన్ తో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్ చేయాలని అనుకుంటే ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

  • ఫ్లాట్ నెం.
  • ఇల్లు లేదు,
  • అపార్ట్ మెంట్/నగరం
  • SRO పీరియడ్
  • క్యాప్చాను నమోదు చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి.

పై 3 పక్రియాలలో క్రింద చూపించిన విధంగా వస్తుంది. ఇప్పుడు మనం Select All అనే ఆప్షన్ ఎంచుకొని Submit Click చేస్తే మీ ఈసీ మీకు కనిపిస్తుంది.

మీ భూమి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ చెక్ చేసుకున్న తర్వాత Print అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈసీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1983కు ముందు ఐజీఆర్ఎస్ ఈసీ ఏపీ సర్టిఫికేట్లు పొందాలంటే ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఈసీ డిపార్ట్మెంట్లోని ఎస్ఆర్వోను సంప్రదించాల్సి ఉంటుంది అనే విషయం మీరు గమనించాలి.

మీకు ఇంకా ఏదైనా సహాయం కావాలంటే కింద మీ పేరు, మొబైల్ నెంబర్ టైపు చేసి కామెంట్ చేయండి, నేను మీకు మెసేజ్ చేస్తాను.

(ఇది కూడా చదవండి: నాలా(NALA) అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles